Begin typing your search above and press return to search.

ఫొటోస్టోరీ: స‌ప్త‌గిరి @ చైనీస్ వారియ‌ర్

By:  Tupaki Desk   |   18 Jun 2016 12:46 PM GMT
ఫొటోస్టోరీ: స‌ప్త‌గిరి @ చైనీస్ వారియ‌ర్
X
హు హ... హు హ అంటూ చైనీస్ వారియ‌ర్‌ గా మారిపోయాడు స‌ప్త‌గిరి. మ‌గ‌జాతి ఆణిముత్యం - పొల్యూష‌న్ గిరిలాంటి పాత్ర‌లతో ర‌క్తిక‌ట్టించిన స‌ప్త‌గిరి అలియాస్ నెల్లూరు గిరి ఈసారి చైనీస్ వారియ‌ర్‌ గా న‌వ్వులు పువ్వులు పూయించ‌డం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గిరి చైనా వేషం వేసింది ఏ సినిమాలోనో తెలుసా? ... `జ‌క్క‌న్న‌`లో. సునీల్ హీరోగా నటించిన ఆ సినిమా టీజ‌ర్ ఈరోజే విడుద‌లైంది.

అందులో మార్ష‌ల్ ఆర్ట్స్ చేస్తూ సునీల్‌ నే భ‌య‌పెట్టాడు స‌ప్త‌గిరి. నీకు మార్ష‌ల్ ఆర్ట్స్ తెలుసా? అని స‌ప్త‌గిరి అంటే నీకు గీతా ఆర్ట్స్ తెలుసా? అని సునీల్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఆ పంచ్ బాగానే పేలింది. చైనా వారియ‌ర్‌గా స‌ప్త‌గిరి వేష‌మే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. స‌ప్త‌గిరి స‌న్నిహితులైతే మా గిరి కెరీర్‌లో గుర్తుండిపోయే మ‌రో పాత్ర రాబోతోందని న‌మ్మ‌కంగా చెబుతున్నారు.