Begin typing your search above and press return to search.

సినిమా రేంజ్ నుండి సీన్ రేంజ్ కి....

By:  Tupaki Desk   |   2 Nov 2015 11:25 AM IST
సినిమా రేంజ్ నుండి సీన్ రేంజ్ కి....
X
టాలీవుడ్ కి బ్రహ్మానందం, ఆలి బోర్ కొట్టేస్తున్న రోజుల్లో, సునీల్ వంటి కమెడియన్లు దూరమైన సమయంలో తెలుగు తెరకు ప్రత్యక్షమైన యువకమెడియన్లలో విజయం సాధించిన వారిలో సప్తగిరి ప్రధమ స్థానంలో వున్నాడు. సునీల్ తరహాలోనే ఒక రెండు చిత్రాలు తన కామెడితో మాత్రమే నెట్టుకొచ్చి ప్రేక్షకుల కళ్ళలో, దర్శకుల దృష్టిలో పడ్డాడు. అయితే ఇప్పుడు హీరోతో పాటూ ట్రావెల్ చేసే ఫుల్ లెంగ్త్ రోల్స్ నుండి కేవలం ఒక్క సీన్ లో మెరిసి మెప్పించే రేంజ్ కి ఎదిగిపోయాడు.

ప్రేమకధా చిత్రమ్ - వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ల తరువాత సప్తగిరిని ఫుల్ లెంగ్త్ రోల్ లో చూడలేదు. రోజుల్లెక్కన పారితోషికం తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తుంది. గీతాంజలి - రాజు గారి గది సినిమాలో కేవలం ఒక్క సన్నివేశంలో అలా మెరిసి ఇలా మాయమైపోయాడు. కాకపోతే వున్నంత సేపూ నవ్వించడంలో సప్తగిరి సఫలమవుతున్నాడు.

ప్రస్తుతం నిఖిల్ 'శంకరాభరణం' సినిమాలో పూర్తి నిడివి చేస్తున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. కెరీర్ స్టార్టింగ్ దశలో వుంది కాబట్టి పారితోషికం పక్కనబెట్టి కొన్ని మంచి పాత్రలు పోషిస్తే మనకు మరో స్టార్ కమెడియన్ దొరికినట్టే.