Begin typing your search above and press return to search.

పవన్ పార్ట్2కి సప్తగిరి పార్ట్1

By:  Tupaki Desk   |   22 Jun 2017 10:03 AM GMT
పవన్ పార్ట్2కి సప్తగిరి పార్ట్1
X
ఓ సిరీస్ లో ఒక స్టార్ హీరో చేస్తే.. అదే సినిమా నెక్ట్స్ సిరీస్ లో కామెడీ హీరో చేశాడనుకుండి.. చూసేందుకు జనాలు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇదే ఫార్మాట్ రివర్స్ లో ఉన్నా రియాక్షన్ ఇలాగే ఉండొచ్చు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కామెడీ హీరోగా మారిన సప్తగిరి ఓ సినిమా విషయంలో ఇలాంటి సంఘటనే జరిగే అవకాశం కనిపిస్తోంది.

సప్తగిరి రీసెంట్ గా సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ ఓ సినిమా చేశాడు. సక్సెస్ రేంజ్ సంగతి పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ ప్రచారం పుణ్యమా అని కలెక్షన్స్ బాగానే వచ్చాయి.. కమర్షియల్ గా వర్కవుట్ అయింది కూడా. ఇప్పుడు అదే నిర్మాతకు సప్తగిరి మరో సినిమా చేస్తున్నాడు. మూవీ పేరును సప్తగిరి ఎల్ ఎల్బీ అంటూ అనౌన్స్ చేసేశారు కూడా. కానీ విషయం ఏంటంటే.. బాలీవుడ్ హిట్ మూవీ జాలీ ఎల్ ఎల్బీ ను సప్తగిరి హీరోగా రీమేక్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటికే జాలీ ఎల్ ఎల్బీకి సీక్వెల్ కూడా వచ్చేసింది.

జాలీ ఎల్ ఎల్బీ2 రైట్స్ ను హారిక హాసిని బ్యానర్ పై రీమేక్ చేసేందుకు రైట్స్ కూడా కొనేశారు. ఫ్యూచర్ లో ఎప్పుడో పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేస్తారనే టాక్ ఉంది. అయితే.. ఇప్పుడు మొదటి భాగాన్ని సప్తగిరి రీమేక్ చేస్తే.. రెండో భాగంలో పవన్ కళ్యాణ్ నటిస్తాడా.. ఒకవేళ చేస్తే జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారా అన్నదే అసలైన డౌట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/