Begin typing your search above and press return to search.

సప్తగిరి ఎక్స్ ప్రెస్.. ఎవరినీ వదిలేటట్లు లేడు

By:  Tupaki Desk   |   3 Oct 2016 4:52 AM GMT
సప్తగిరి ఎక్స్ ప్రెస్.. ఎవరినీ వదిలేటట్లు లేడు
X
అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా మారిపోయిన సప్తగిరి.. ఇప్పుడు హీరో అయిపోతున్నాడు. ఈ కమెడియన్ కి తన మీద తనకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే.. తను హీరోగా పరిచయం అవుతున్న మూవీకి సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ.. తన పేరే పెట్టేసుకున్నాడు.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్లను యూనిట్ లాంఛ్ చేసింది. వీటిని చూస్తుంటే.. సప్తగిరికి అచ్చొచ్చిన స్పూఫ్ లను అడ్డం పెట్టుకునే కథ రాసుకున్నట్లుగా కనిపిస్తోంది. పోలీస్ డిపార్ట్ మెంట్ నేపథ్యంలో.. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం అంటున్నా... ఓ పోస్టర్ లో నాగార్జున ఘరానాబుల్లోడు గెటప్ ప్లస్ జట్కాబండిని చూపించాడు సప్తగిరి. మరో పోస్టర్ లో అయితే.. ఏకంగా సూపర్ మ్యాన్ టైపులో ఎగిరిపోతున్నాడు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఎవరినీ వదిలిపెట్టకుండా స్పూఫ్ లు సిద్ధం చేసేసినట్లుగా కనిపిస్తోంది.

ఈ సప్తగిరి ఎక్స్ ప్రెస్ కి అసలు హైలైట్ ఏంటంటే.. స్క్రిప్ట్ రచయిత ఎవరో కాదు.. సప్తగిరే. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న అనుభవంతో.. తనే స్క్రిప్ట్ రాసుకున్నట్లు చెప్పిన ఈ కామెడీ హీరో.. త్రివిక్రమ్ కి అసిస్టెంట్ గా పని చేసిన అరుణ్ పవార్ ని డైరెక్టర్ గా తీసుకున్నాడు. కన్నడ బ్యూటీ రోషిణీ ప్రకాష్ హీరోయిన్ గా నటించగా.. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ రెడీ చేసేయబోతున్నారు. ఇన్నాళ్లూ పోలెండ్ లో షూటింగ్ జరపగా.. ఇక ఇండియాలోనే మిగిలిన పార్ట్ షూట్ చేస్తారట సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీమ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/