Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: డ్యాన్స్ గురుతో నెల్లూరు గిరి

By:  Tupaki Desk   |   20 Feb 2016 7:44 AM GMT
ఫొటో స్టోరీ: డ్యాన్స్ గురుతో నెల్లూరు గిరి
X
మొన్నామ‌ధ్య టీవీఎస్ బైక్ కోసమ‌ని ధోనీ చేత లుంగీ క‌ట్టించి అదుర్స్ అనిపించాడు ప్ర‌భుదేవా మాస్ట‌ర్‌. ఇప్పుడేమో మ‌న కామెడీ ధోనీలాంటి నెల్లూరి స‌ప్త‌గిరికి లుంగీ క‌ట్టించాడు. వీళ్లిద్ద‌రినీ ఇలా చూస్తుంటే పూల రంగ‌ళ్లు ఒక చోట చేరిన‌ట్టు అనిపించడం లేదూ! ఎంతైనా మ‌న నెల్లూరు స‌ప్త‌గిరిది అదృష్ట‌మండీ. ప్ర‌భుదేవా మాస్ట‌ర్‌తో ఇలా జోడీ క‌ట్టేశాడు. అన్న‌ట్టు వీళ్లిద్ద‌రూ క‌లిసి త్వ‌ర‌లోనే తెర‌పై న‌వ్వులు పండించ‌బోతున్నారు. తెలుగు - త‌మిళం - హిందీ భాష‌ల్లో ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఓ సినిమా కోస‌మే వీళ్లిలా క‌లిశారు.

ఇందులో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఓ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్‌ గా తెర‌కెక్కుతున్న సినిమా ఇది. హార్ర‌ర్ సినిమాలో న‌వ్వులు పండించాలంటే అంద‌రికీ గుర్తుకొచ్చేది స‌ప్త‌గిరినే క‌దా! అందుకే త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్ కూడా స‌ప్త‌గిరినే ఎంచుకొన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కోన వెంక‌ట్ స‌మ‌ర్పిస్తున్నారు. ఆయ‌నే ర‌చ‌యిత కూడా. ఇక కోన వెంక‌ట్‌ లాంటి ర‌చ‌యిత అయితే స‌ప్త‌గిరి కోసం ఎలాంటి డైలాగులు రాస్తాడో చెప్ప‌క్క‌ర్లేదు. మొత్త‌మ్మీద ఈ సినిమాతో స‌ప్త‌గిరి తెలుగు - త‌మిళం - హిందీ మూడు భాష‌ల్లో అద‌ర‌గొట్టేస్తాడేమో అనిపిస్తోంది. ప్ర‌భుదేవా చాలా రోజుల త‌ర్వాత తెలుగులో న‌టిస్తున్న చిత్ర‌మిది. ఓ క్రేజీ కాంబినేష‌న్‌ తో తెర‌కెక్కుతోంది కాబ‌ట్టి భారీగా అంచ‌నాలున్నాయి.