Begin typing your search above and press return to search.

బాహుబ‌లి సంపూ.. క‌ట్ట‌ప్ప పృథ్వీ

By:  Tupaki Desk   |   14 Feb 2016 3:57 AM GMT
బాహుబ‌లి సంపూ.. క‌ట్ట‌ప్ప పృథ్వీ
X
ఏటా జ‌రిగే మా టీవీ అవార్డుల కార్య‌క్ర‌మం ఫాలో అయ్యేవారికి ఆలీ, సుమ క‌లిసి చేసే పేర‌డీలు, స్పూఫ్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సాగ‌ర సంగ‌మం, గీతాంజ‌లి, అరుంధ‌తి, మ‌గ‌ధీర లాంటి సినిమాల స్పూఫ్ ల‌ను ఈ జంట అద్భుతంగా పండించింది. గ‌త ఏడాది బాహుబ‌లి స్పూఫ్ కూడా అదిరిపోయింది. ఇక ఈ ఏడాది మా టీవీ అవార్డుల కోసం ఎలాంటి స్పూఫ్ రెడీ చేస్తున్నారా అని జ‌నాల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఐతే త్వ‌ర‌లోనే ప్ర‌సారం కాబోతున్న మా టీ అవార్డుల కోసం మ‌రోసారి అదిరిపోయే బాహుబ‌లి స్పూఫ్ తో రెడీ అయింద‌ట మా టీమ్‌.

కానీ ఈసారి ఓ పెద్ద ఛేంజ్ క‌నిపించ‌బోతోంది ఈ స్పూఫ్ లో. ఇందులో క‌థానాయ‌కుడి పాత్ర‌ను ఆలీ పోషించ‌ట్లేదు. ఆ ప్లేస్ లోకి బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు వ‌చ్చేస్తున్నాడు. ఈ స్పూఫ్ లో బ‌ర్నింగ్ బాబు ఒక‌టికి రెండు పాత్ర‌లు పోషించ‌బోతుండ‌టం విశేషం. ఒక‌టి బాహుబ‌లి పాత్ర కాగా.. ఇంకోటి పైర‌సీకేయ పాత్ర‌. కాల‌కేయ పాత్ర స్ఫూర్తితో ఈ పైర‌సీకేయ క్యారెక్ట‌ర్ ను తీర్చిదిద్దారు. ఆలీ త‌ర‌హాలోనే ఉత్త‌మ న‌టుడి అవార్డు కోసం ఆరాట‌ప‌డే వాడిగా క‌నిపించ‌బోతున్నాడు సంపూ. ఈ పైర‌సీకేయ దానికి అడ్డు ప‌డ‌తాడ‌ట‌.ఇందులో సుమ‌తో పాటు బాయిలింగ్ స్టార్ పృథ్వీ కూడా సంద‌డి చేయ‌బోతుండ‌టం విశేషం. సుమ‌ది శివ‌గామి పాత్ర కాగా.. పృథ్వీది క‌ట్ట‌ప్ప క్యారెక్ట‌ర్‌. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అవార్డుల కార్య‌క్ర‌మంలో ఈ స్పూఫ్ ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు.