Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పబ్బీ.. మహా హాటురా అబ్బీ!

By:  Tupaki Desk   |   5 April 2020 10:00 PM IST
ఫోటో స్టోరీ: పబ్బీ..  మహా హాటురా అబ్బీ!
X
ఈ ప్రపంచంలో అందాలకు.. అందమైన భామలకు.. అందాలను దాచుకోకుండా ప్రదర్శించే సుందరాంగులకు కొదవేమీ లేదు. నిజానికి ఈ ప్రపంచంలో చాలామంది దరిద్రాలను..ముష్టి ఫిలాసఫీలను.. రోగాలను.. రొష్టులను ఎక్కువగా ఆకర్షిస్తుంటారు కాబట్టి ఇలాంటి అందాలను పట్టించుకునే సమయం తీరిక దొరకదు. కానీ కొంతమంది కళాత్మక హృదయులకు మాత్రం ఈ ప్రపంచం ఎప్పుడూ అందమైనదే. కరోనా కాలం కానివ్వండి. బ్లాక్ డౌన్ లో బందీలుగా ఉండనివ్వండి.. అయినా అందాల కోసం వారు వెతుకుతూనే ఉంటారు. అలాంటి వారి కోసమే జన్మనెత్తిన సుందరి ఈ సప్న పబ్బి.

ఈ 33 ఏళ్ల బ్రిటిష్ భామ బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. వరుణ్ తేజ్ సినిమా ' లో ఈ సుందరి తళుక్కున మెరిసింది. ఈ జనరేషన్ భామ కావడంతో వెబ్ సిరీస్ లలో తన సత్తా చాటుతోంది. అత్యంత ప్రజాదరణ పొందిన ' బ్రీత్' వెబ్ సిరీస్ లో ఈ భామ నటించింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో విరుచుకుపడడం ఈ భామకు ఓ స్పెషల్ హాబీ. అందుకే క్రమం తప్పకుండా ఏదో ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ నెటిజన్ల మనసులను ఉల్లాస పరుస్తూ ఉంటుంది.

పైన ఉన్న ఫోటోలో షర్టు మాత్రమే ధరించి.. బాటం లేకుండా.. వయ్యారం ఒలకపోస్తూ ఒక స్టూలు పై ఆధునిక ఖజురహో శిల్పం తరహాలో వగలు పోయింది. ఆ కాళ్ల అందాలు చూస్తే త్రివిక్రమ్ గారు మరోసారి సిరివెన్నెల గారిని.. ఈ పాప కాళ్ళపై ఇంకో సామజవరగమన రాయమని చెప్తారేమో. అంత నాటీగా..రియల్ హాటీ తరహాలో కనిపిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ఈ భామ ప్రస్తుతం 'సత్ర కో షాదీ హై' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.