Begin typing your search above and press return to search.

ఫారిన్ పాపతో కుర్ర హీరో లవ్వాట

By:  Tupaki Desk   |   27 Sep 2015 11:30 AM GMT
ఫారిన్ పాపతో కుర్ర హీరో లవ్వాట
X
సినిమాలు హిట్ కానపుడు క్రేజ్ పెరగాలంటే ఏం చేయాలి ? ఈ ప్రశ్నకి సౌత్ హీరోయిన్స్ ని అడిగితే అంత పర్ఫెక్ట్ ఆన్సర్ రాదు కానీ... బాలీవుడ్ భామలను అడిగితే వంద రకాల ఐడియాలు ఇచ్చేస్తారు. అరకొరా డ్రస్సులో పార్టీలకి వెళ్లి హంగామా చేయడం, స్టార్ హీరోతో అఫైర్ ఉన్నట్లు పుకార్లు పుట్టించడం, లేదా ఎవరైనా స్టేటస్ ఉన్న హీరో కొడుకుతో షికార్లు చేసి, మీడియాకి లీకులివ్వడం. కామోషియాన్ చిత్రంలో ఎంత హాట్‌ గా అందాలు ఒలికించిన ఫారిన్ సప్నా పబ్బి.

ఆ మూవీ సక్సెస్ కాకపోయినా.. యూత్ పల్స్ ని పట్టుకోవడంలో మాత్రం సప్నా పబ్బి సక్సెస్ అయింది. ఈ మూవీలో కాస్త జనాలకు గుర్తుండే అంశం సప్నా గ్లామర్ మాత్రమే. ఇప్పుడీ భామ అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్‌ తో ప్రేమలో ఉందని.. బాలీవుడ్ కోడై కూస్తోంది. వీరిద్దరూ కలిసి రెస్టారెంట్స్ - పబ్స్ చుట్టూ చక్కర్లు కొట్టేస్తున్నారట. ముంబై వీధులన్నీ తెగ తిరుగుతున్నారట. ఎవరైనా మీడియా వాళ్లు ప్రశ్నిస్తే మాత్రం.. యాజ్ యూజువల్ గా తమ మధ్య ఉన్నది ఫ్రెండ్‌ షిప్ మాత్రమే అని చెబుతున్నారు లెండి. హర్షవర్ధన్ - సప్నా పబ్బీల మధ్య ప్రేమకథ ఓ రేంజ్ లో నడుస్తోందని బాలీవుడ్ అంటోంది.

ప్రస్తుతం మీర్జి యాన్ లో నటిస్తున్నాడు హర్షవర్ధన్. ఇదే ఇతగాడి మొదటి మూవీ. ఇంకా లాంఛింగ్ మూవీ కూడా రిలీజ్ కాకుండా.. ఇంత పబ్లిక్ గా తిరగడం కరెక్ట్ కాదని.. హితబోధలు చేస్తున్నాడట అనిల్ కపూర్. కనీసం మీడియా కంటపడకుండా అయినా ఉండాలని సూచనలు అందించాడట. అయితే తండ్రి మాటలను ఈ కుర్ర హీరో పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. అనుభవంతో చెబుతున్న మాటలు వినవయ్యా హర్షవర్దన్. ఇలాంటివి ఎన్ని చూసుంటాడు అనిల్ కపూర్.