Begin typing your search above and press return to search.

పబ్బీ.. టాలీవుడ్ పిలుస్తోంది

By:  Tupaki Desk   |   22 Dec 2015 1:30 PM GMT
పబ్బీ.. టాలీవుడ్ పిలుస్తోంది
X
సప్నా పబ్బీ.. తెలుగు ప్రజలకు పేరుతో అంత పెద్దగా పరిచయం లేకపోయినా, ఈమె మాత్రం బాగానే తెలుసు. హిందీ సీరియల్స్ తో తన ట్యాలెంట్ చూపించడం మొదలుపెట్టిన సప్నా పబ్బీ.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల వరకూ వచ్చేసింది. రీసెంట్ గా జరిగిన స్టార్ డస్ట్ అవార్డ్ ఫంక్షన్ లో ఈమెను చూశాక.. చాలామంది సప్నా పబ్బీ అడ్రస్ కోసం ఎంక్వైరీలు మొదలుపెట్టేశారు. ఘర్ ఆజా పర్దేశీ - 24 సీరియల్స్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది ఈ బ్రిటిష్ భామ.

ఆ తర్వాత అనేక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ చేసింది. అర్జున్ రాంపాల్ తో కలిసి గెలాక్సీ చాకొలేట్ యాడ్ లోను - విరాట్ కోహ్లీతో కలిసి పెప్సీ యాడ్ లోను - యామీ గౌతంతో కలిసి ఫెయిర్ అండ్ లవ్ లీ యాడ్ లోనూ కనిపించి బాగానే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఖామోషియా అనే మూవీతో బాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. దీనితో పాటే సత్రా కో శాదీ హై లోనూ నటించేస్తోంది. ఏదో సీరియల్స్ లోనో, రెండు సినిమాల్లోనే నటించిందంతే అని తీసి పారేయడానికి ఛాన్స్ లేదు.. ఈమె రేంజ్ వేరుగా ఉంది. మ్యాన్స్‌ వరల్డ్‌.. వంటి మ్యాగజైన్లలో అమ్మడు రెచ్చిపోయి యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. అసలు ఒంటిమీద ఉన్నాయో లేవో తెలీనంతగా డ్రెసింగ్ తో రచ్చ రచ్చ చేసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఇప్పుడు స్టార్ డస్ట్ అవార్డ్ ఫంక్షన్ కి కూడా ఇంత రేంజ్ ను చూపించుకుంటూ వచ్చింది. ఇదీ క్లీవేజ్ షో అంటే అనిపించేలా.. ఓ బెంజ్ మార్క్ సెట్ చేస్తుందా అనిపించేలా అందాలను ప్రదర్శించేసింది. సప్నా పబ్బీ హంగామాను చూసిన టాలీవుడ్ డైరెక్టర్లు - ప్రొడ్యూసర్లు.. ఇప్పుడీమె గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. మాంచి ఆఫర్ ఒకటి తగిలితే మాత్రం.. త్వరలో తెలుగులోనూ ఇంతందాన్ని చూసేసే ఛాన్స్ టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తుంది.