Begin typing your search above and press return to search.

రిలీజ్ కి ముందే హిందీలోకి హైపర్

By:  Tupaki Desk   |   22 Sep 2016 2:54 PM GMT
రిలీజ్ కి ముందే హిందీలోకి హైపర్
X
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన హైపర్.. విడుదలకు అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుంటోంది. ముందుగా అనుకున్నట్లుగానే సెప్టెంబర్ 30న హైపర్ విడుదల కానుంది. ఇంకా రిలీజ్ కూడా కాకుండా.. హైపర్ టీమ్ కి బూస్ట్ ఇచ్చే సంఘటన జరిగింది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన హైపర్ కు.. హిందీలో రీమేక్ చేసేందుకు ఓ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ రైట్స్ కొనుక్కుకుంది.

బాలీవుడ్ రైట్స్ రూపంలో హైపర్ కు ఏకంగా 2 కోట్ల ముట్టాయి. ఓ మీడియం బడ్జెట్ మూవీకి ఇది చాలా పెద్ద మొత్తం అని అంగీకరించాల్సిందే. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి హైపర్ పై బజ్ నెలకొనగా.. ట్రైలర్ తో ఇది పీక్స్ కి చేరిపోయింది. అయితే.. తెలుగు మూవీ హైపర్ రిలీజ్ కాకముందే.. హిందీ రైట్స్ ని ఎగరేసుకుపోవడం..అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో కూడా సంతోష్ శ్రీనివాస్ సినిమాలకు ఇలాంటి డిమాండ్ కనిపించింది. రామ్ తో ఈ డైరెక్టర్ చేసిన కందిరీగ చిత్రాన్ని.. వరుణ్ ధావన్-ఇలియానా-నర్గీస్ ఫక్రీలతో హిందీలో తీశారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన రభస రైట్స్ కూడా మంచి రేట్ కే విక్రయమైనా.. దీన్ని డబ్బింగ్ మాత్రమే చేసి విడుదల చేశారు. ఇప్పుడు హైపర్ హిందీ రైట్స్ కూడా మంచి రేటు పలకడంతో.. బాలీవుడ్ లో సంతోష్ శ్రీనివాస్ పేరు బాగానే బాగానే వినిపిస్తోంది.