Begin typing your search above and press return to search.

జూన్‌ 3 నుండి కందిరీగ కాంబో!!

By:  Tupaki Desk   |   15 May 2016 1:30 PM GMT
జూన్‌ 3 నుండి కందిరీగ కాంబో!!
X
కొన్ని కాంబినేషన్లు చూడగానే ఆకర్షిస్తాయి. సినిమా విడుదలకు ముందే ఆసక్తి కలిగిస్తాయి. ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయింది. మహేష్ తో వరుస సినిమాలు తీసిన 14రీల్స్ ఎంటర్టెయిన్మెంట్స్.. రీసెంట్ గా నానితో కృష్ణగాడి వీర ప్రేమగాధతో ట్రాక్ లోకి వచ్చింది. ఇప్పుడీ బ్యానర్ పై క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది.

ఎనర్జిటిక్ హీరో రామ్ - దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. వీరిద్దరూ కలిసి కందిరీగ అంటూ ఎంత హంగామా చేశారో టాలీవుడ్ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇప్పుడు మరోసారి జత కట్టారు. ఇవాళ అంటే మే 15న హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో - రామ్ హీరోగా 14రీల్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించిన యూనిట్.. పలు వివరాలను వెల్లడించింది.

జూన్ 3 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి.. నాన్ స్టాప్ గా షూటింగ్ చేయనున్నారట. సెప్టెంబర్ 30న కానీ, ఆగస్ట్ 7న కానీ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. జిబ్రాన్ సంగీతం అందించనుండగా.. యాక్షన్ ఎంటర్టెయినర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు.