Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ కథ' లో 'బ్యాట్' సైజే అసలు మ్యాటర్..!

By:  Tupaki Desk   |   23 March 2021 4:54 AM GMT
ఏక్ మినీ కథ లో బ్యాట్ సైజే అసలు మ్యాటర్..!
X
'పేపర్ బాయ్' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఏక్ మినీ కథ''. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రద్ధాదాస్ కీలక పాత్రలో కనిపిస్తోంది. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. 'డజ్‌ సైజ్‌ మ్యాటర్‌?' అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ - మినీ టీజర్ లతో అసలు సినిమాలో మ్యాటర్ ఏంటని ఆడియన్స్ ఆలోచించేలా చేశారు.

తన ప్రైవేట్ పార్ట్ సైజ్ చిన్నదని ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో ఉండే హీరో, హీరోయిన్ తో ఫస్ట్ నైట్ ని అవాయిడ్ చేయడమే 'ఏక్ మినీ కథ' మెయిన్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. దీనికి తగ్గట్టే హీరో సంతోష్ చిన్న బ్యాట్ పట్టుకొని ఉండటం 'సైజ్' అనేదే ఇక్కడ మ్యాటర్ అనే విషయాన్ని నిర్ధారిస్తోంది. మొత్తం మీద ఈ జెనెరేషన్ లో చాలా మంది యువకులను వెంటాడే సమస్య గురించి ఈ చిత్రంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

'ఏక్ మినీ కథ' చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ - సుదర్శన్ - హర్షవర్ధన్ - సప్తగిరి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.