Begin typing your search above and press return to search.

రాంగ్ టైం లో.. రైట్ మూవీ..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 6:51 AM GMT
రాంగ్ టైం లో.. రైట్ మూవీ..!
X
సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ.. ఎప్పటిలానే ఈ పండుగకి కూడా స్టార్ సినిమాల సందడి షురూ కానుంది. మెగాస్టార్ వీరయ్య.. బాలయ్య బాబు వీర సింహా రెడ్డి ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడనుంది. ఇక ఈ సినిమాలతో పాటుగా దళపతి విజయ్ వారసుడు కూడా వస్తుంది. విజయ్ వారసుడు సినిమా తెలుగులో అంత ఇంప్యాక్ట్ క్రియేట్ చేయగలదా లేదా అన్నది డౌటే అని చెప్పొచ్చు. అదీగాక వారసుడు ట్రైలర్ చూస్తే ఆల్రెడీ తెలుగులో వచ్చిన చాలా సినిమాల కథల్లాగే అనిపించింది.

ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వస్తుంది కళ్యాణం కమనీయం. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు. ప్రియా భవాని శంకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను అనీల్ కుమార్ డైరెక్ట్ చేశారు.

సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అయితే మూడు పెద్ద సినిమాల తాకిడికి సంతోష్ శోభన్ సినిమా తట్టుకుంటుందా అన్న డౌట్ రావొచ్చు. ప్రతి సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటుగా చిన్న సినిమా ఒకటి వస్తుంది. చిన్న సినిమా అని కాదు కానీ తక్కువ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది.

ఇందుకు బెస్ట్ ఎక్సాంపుల్ నాగార్జున చేసిన సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు సినిమాలే. ఈ సినిమాలు పొంగల్ రిలీజై సూపర్ సక్సెస్ అయ్యాయి. పోటీగా ఎంత పెద్ద సినిమాలు ఉన్నా పండుగ హాలీడేస్ లో ఫ్యామిలీ అంతా ఈ సినిమాలను చూసి బ్రహ్మరథం పట్టారు.

ఇప్పుడు అదే ఫార్ములా తో సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం సినిమా వస్తుందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా చూసే చక్కని చిత్రంగా ఈ మూవీ వస్తుంది. నాగ్ సినిమాలు కనెక్ట్ అయినట్టుగా ఈ సంక్రాంతికి సంతోష్ శోభన్ సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మాత్రం సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క.

సంక్రాంతి బరిలో అజిత్ తెగింపు కూడా వస్తుంది. అయితే ఆ సినిమా తెలుగులో అంత బజ్ తీసుకురలేకపోతుంది. ఏదో ఫార్మల్ గా రిలీజ్ చేస్తున్నారే తప్ప అజిత్ తెగింపుకి సరైన ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. మరి పొంగల్ రేసులో వస్తున్న ఈ ఐదు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. సంతోష్ శోభన్ సినిమా టాక్ బాగున్నా సరే వసూళ్లు అదరగొట్టే ఛాన్స్ ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.