Begin typing your search above and press return to search.

హిట్టు పడిందే ఆలస్యం.. వరుస ప్రాజెక్టులు ప్రకటించిన యువహీరో..!

By:  Tupaki Desk   |   29 May 2021 12:30 PM GMT
హిట్టు పడిందే ఆలస్యం.. వరుస ప్రాజెక్టులు ప్రకటించిన యువహీరో..!
X
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యూవి క్రియేషన్స్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు యూవి కాన్సెప్ట్స్ అనే న్యూ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మిస్తోంది. అయితే ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా తెరకెక్కింది 'ఏక్ మినీ కథ'. ఇంతవరకు తెలుగు సినిమాల్లో ప్రస్తావించని ఓ బోల్డ్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇటీవలే 'ఏక్ మినీ కథ' డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. బోల్డ్ పాయింట్ అయినా జనాలకు కాన్సెప్ట్ బాగా కనెక్ట్ అయింది. అందుకే ఏక్ మినీ కథ మూవీ ఓటిటి వేదికగా మంచి సక్సెస్ అందుకుంది. 'డస్ సైజ్ మేటర్..?' అనే బోల్డ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. నిజానికి థియేట్రికల్ రిలీజ్ గురించి చాలా ప్రమోషన్స్ జరిపారు కానీ ఆఖరికి సినిమా ఓటిటి రిలీజ్ అయిపోయింది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో యువహీరో సంతోష్ శోభన్ తన ఖాతాలో మొదటి హిట్ వేసుకున్నాడు. బోల్డ్ పాయింట్ అయినప్పటికీ సినిమాను మంచి హిట్ చేశారు ప్రేక్షకులు. మంచి ఫన్ కథనంతో మూవీ ఆకట్టుకుంటుంది. అయితే ఫస్ట్ హిట్ పడిందో లేదో అప్పుడే హీరో సంతోష్ తన తదుపరి సినిమాల గురించి సమాచారం బయటపెట్టాడు. దాదాపు ఈ హీరో టాలీవుడ్ బడా ప్రొడక్షన్స్ అన్నింటిలో ఒక్కో సినిమా ఓకే లైనప్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సంతోష్.. గోల్కొండ హైస్కూల్ అనే సినిమాలో మెరిసాడు. తర్వాత పేపర్ బాయ్ మూవీతో సోలో హీరోగా డెబ్యూ అయ్యాడు. కానీ ఆ సినిమా నిరాశపరిచింది.

తాజాగా 'ఏక్ మినీ కథ' సంతోష్ కు ఫస్ట్ సక్సెస్ అందించింది. ఈ విషయాన్ని స్వయంగా హీరోనే లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో ప్రస్తావించాడు. డైరెక్టర్ శోభన్ తనయుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంతోష్.. తదుపరి సినిమా కూడా యూవి క్రియేషన్స్ బ్యానర్ లోనే చేయనున్నట్లు తెలిపాడు. ఈ సినిమాతో పాటు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా - వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒకటి.. అలాగే ఓ డెబ్యూ డైరెక్టర్ తో ఓ సినిమా చేయనున్నాడట. వీటన్నిటితో పాటుగా సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడని స్వయంగా బయటపెట్టాడు. చూస్తుంటే త్వరలో సంతోష్ టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరో అయ్యేలా ఉన్నడంటూ టాక్ నడుస్తుంది. మొత్తానికి ఈ మినీ కథ హీరో కెరీర్ బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు.