Begin typing your search above and press return to search.

రూ.10-15 కోట్ల రేంజ్ శాటిలైట్ హీరోలు

By:  Tupaki Desk   |   24 Sep 2019 1:30 AM GMT
రూ.10-15 కోట్ల రేంజ్ శాటిలైట్ హీరోలు
X
`బాహుబ‌లి` ముందు.. బాహుబ‌లి త‌ర్వాత టాలీవుడ్ ని ప‌రిశీలిస్తే ఎదుగుద‌ల స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. తెలుగు సినిమా క‌థ‌లు మారాయి.. మార్కెట్ పెరిగింది. టాలీవుడ్ ని ద‌క్షిణాది చిత్ర సీమ‌ల‌తో పాటు బాలీవుడ్ కూడా ఆస‌క్తిగా ప‌రిశీలిస్తోంది. ఏ సినిమా ఏ స్థాయిలో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుందో.. ఏ స్థాయిలో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందో అని ఓ క‌న్నేసి ఉంచుతున్నారు. డిజిట‌ల్ రైట్స్ విష‌యంలోనూ ఆ పోటీ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్స్ తో పాటు అమెజాన్‌- జీ5 - నెట్‌ ఫ్లిక్స్ వంటివి తెలుగు సినిమా శాటిలైట్ డిజిట‌ల్ రైట్స్ కోసం ఎగ‌బ‌డుతున్నాయి. ఈ పోటీలో భారీగానే డ‌బ్బు చేతులు మారుతోంది

అయితే తెలుగులో 10 నుంచి 15 కోట్ల రేంజ్ శాటిలైట్ హ‌క్కుల్ని సొంతం చేసుకుంటున్న హీరోలు ఎంత మంది? అన్న‌ది ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిశాయి. ఈ లెక్క `బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ నుంచే మొద‌లు పెట్టాలి. ప్ర‌భాస్ సినిమా శాటిలైట్ రైట్స్ డిజిట‌ల్ రైట్స్ రేంజు ఊహించ‌నంత పెరిగింది. `సాహో` సినిమా డిజిట‌ల్ రైట్స్ అన్ని భాష‌ల్లో క‌లిపి జీ నెట్‌ వ‌ర్క్ సంస్థ 70 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఇది పాన్ ఇండియా రేంజు. ఆ త‌ర్వాత మ‌హేష్‌-చ‌ర‌ణ్-ఎన్టీఆర్ - అల్లు అర్జున్ సినిమాల‌కు శాటిలైట్ డిమాండ్ పెద్ద రేంజు(20కోట్ల లోపు)లో ఉంది. బ‌న్ని `అల వైకుంటపురంలో` డిజిట‌ల్ రైట్స్ రేంజ్ 12-15కోట్ల మేర ప‌లుకింది. స‌న్ నెక్ట్స్ వాళ్లు ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ చేజిక్కించుకున్నారు. జెమిని టీవీ ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల్ని ద‌క్కించుకుందిట‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్ - అనీల్ రావిపూడి కాంబినేష‌న్ మూవీ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రానికి 16.5 కోట్ల మేర శాటిలైట్ రైట్స్ కి జెమిని నెట్ వ‌ర్క్ కి విక్ర‌యించార‌ట‌.

అంత‌కు త‌క్కువ స్థాయిలో శాటిలైట్ డిజిట‌ల్ హ‌క్కుల్లో క్రేజు ఉన్న హీరోల్లో నాని 12 కోట్ల రేంజ్‌ లో వున్నాడు. అత‌ను న‌టించిన `జెర్సీ` చిత్రాన్ని జీ టీవి 12 కోట్ల‌కు సొంతం చేసుకుంది. నాగ‌చైత‌న్య మ‌జీలీ - నాగార్జున న‌టించిన `మ‌న్మ‌థుడు-2` చిత్రాలు 8.5 కోట్ల రేంజు ప‌లికాయి.

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ `టాక్సీవాలా`.. గీత గోవిందం రూ.4.5 కోట్ల రేంజును తాకాయి. డియ‌ర్ కామ్రేడ్ మాత్రం రూ.10 కోట్లు దాటింద‌ని తెలిసింది. వ‌రుణ్‌తేజ్ న‌టించిన `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` 10 కోట్లకు అమ్ముడు పోయింది. ఈ చిత్ర శాటిలైట్ హ‌క్కుల్ని స్టార్ మా సొంతం చేసుకుంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాల‌కు కూడా భారీగానే డిమాండ్ వుంది. అత‌ని చిత్రాల‌కి తెలుగుతో పాటు హిందీ డ‌బ్బింగ్ రైట్స్ రూపేనా 12కి మించి వ‌స్తున్నాయి.. శాటిలైట్ డిజిట‌ల్ రేంజు పెద్ద‌గానే ఉంది. ఇత‌ర హీరోల‌కు స్థాయిని బ‌ట్టి శాటిలైట్ .. డిజిట‌ల్ రైట్స్ లో డిమాండ్ ఉంది.