Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా.. 5 మిలియన్ బొనాంజా!

By:  Tupaki Desk   |   20 Jan 2017 5:46 AM GMT
తెలుగు సినిమా.. 5 మిలియన్ బొనాంజా!
X
ఆల్రెడీ ‘బాహుబలి’ సినిమా ప్రభంజనం వల్ల తెలుగు సినిమాను చూసి అసూయతో రగిలిపోతున్నారు బాలీవుడ్ జనాలు. ఇప్పుడు యుఎస్ మార్కెట్లో తెలుగు సినిమాల జోరు చూసి వాళ్ల అసూయ మరింత పెరిగేలా ఉంది. ఒకప్పుడు ఇండియన్ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ అంటే బాలీవుడ్ సినిమాలకే ఉండేది. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ల సినిమాలే అక్కడ ఆదరణ పొందేవి. కానీ గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో అనూహ్యమైన ఆదరణ సంపాదించాయి. ఇప్పుడు మిలియన్ క్లబ్ అన్నది మనోళ్లకు డెడ్ ఈజీ అయిపోయింది. దాదాపుగా ప్రతి స్టార్ హీరో మిలియన్ మార్కును అందుకుంటున్నాడు. 2 మిలియన్.. 3 మిలియన్ అంటూ.. రేంజి పెంచుకుంటూ వెళ్తున్నారు.

ఈ సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలు ఏకంగా 5 మిలియన్ డాలర్ల మార్కును అందుకునేలా ఉండటం బాలీవుడ్ వాళ్లను విస్మయ పరుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఆల్రెడీ 2.3 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. ఈ సినిమా ఫుల్ రన్లో 2.6-2.7 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేయొచ్చని భావిస్తున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ సినిమా 1.5 మిలియన్ మార్కుకు చేరువగా ఉంది. ఫుల్ రన్లో ఈ చిత్రం 1.8-2 మిలియన్ల వరకు వసూలు చేయొచ్చు. ఇక ఆల్రెడీ హాఫ్ మిలియన్ మార్కును అందుకున్న శర్వానంద్ మూవీ ‘శతమానం భవతి’ మిలియన్ మార్కుకు కూడా చేరువగా వెళ్లే అవకాశముంది. మొత్తంగా సంక్రాంతి సినిమాలు మూడూ కలిపి 5 మిలియన్ల క్లబ్బులో అడుగుపెట్టడం గ్యారెంటీ అని తేలిపోయింది. ఇండియాలో మిగతా ఇండస్ట్రీలన్నింటికీ మన సినిమాలు కంటగింపు అవుతాయనడంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/