Begin typing your search above and press return to search.

అఫీషియల్‌: 11.. 12.. 14 లాక్ అయిపోయాయ్

By:  Tupaki Desk   |   1 Jan 2017 11:42 AM GMT
అఫీషియల్‌: 11.. 12.. 14 లాక్ అయిపోయాయ్
X
ఇప్పుడు సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ''ఖైదీ నెం 150''తో పాటు బాలకృష్ణ 100వ చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి'' ఈ సీజన్లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. వీరితో పాటు శర్వానంద్ ''శతమానం భవతి'' సినిమా కూడా వస్తోంది. అయితే ఇంతవరకు రిలీజ్ డేట్లపై క్లారిటీ లేదు కాని.. ఇప్పుడు ఇచ్చేశారు.

జనవరి 11న అందరికంటే ముందు మెగాస్టార్ దూసుకొస్తున్నారు. రామ్ చరణ్‌ ప్రొడ్యూస్ ను చేసిన ఈ కమర్షియల్ మసాలా ఫిలిం 11నే వస్తోందని ఈరోజు కన్ఫామ్ చేశారు ఖైదీ టీమ్. ఇకపోతే బాలయ్య తెస్తున్న తెలుగు చక్రవర్తి చరిత్రను ముందుగా చెప్పినట్లే జనవరి 12న రిలీజ్ చేస్తారని వార్తలొస్తున్నాయి. అదే విషయాన్ని టీమ్ కూడా ఇప్పుడు కన్ఫామ్ చేసింది. ఇక అందరికంటే ముందే.. శతమానం భవతి సినిమాను 14న విడుదల చేస్తామని దిల్ రాజు క్యాంప్ స్పష్టం చేసేసింది.

సో.. సంక్రాంతికి తెలుగువారి కడుపునిండా ఎంటర్టయిన్మెంట్ నింపడానికి మూడు సినిమాలు లాక్ అయిపోయినట్లే. ఇప్పుడు ఫోకస్ అంతా.. ఎవరికి ఏ ధియేటర్లలో టిక్కెట్లు దొరుకుతాయి అనేది ఫ్యాన్స్ అండ్ సినిమా లవర్స్ తేల్చుకోవాల్సిందే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/