Begin typing your search above and press return to search.

కంటెంట్‌.. ధియేటర్లు.. 2 వారాలు..

By:  Tupaki Desk   |   23 Jan 2016 7:30 AM GMT
కంటెంట్‌.. ధియేటర్లు.. 2 వారాలు..
X
ప్రస్తుతం టాలీవుడ్‌ కు షాకిచ్చిన అంశం ఏంటంటే.. అసలు సంక్రాంతి రిలీజ్‌ లన్నీ టాక్‌ తో సంబంధం లేకుండా ఎలా గట్టెక్కాశాయ్‌ అనేది. రిలీజయినప్పుడు ఒక్క సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు తప్పిస్తే.. నాన్నకు ప్రేమతో - ఎక్స్‌ప్రెస్‌ రాజాలకు మిక్సడ్‌ టాక్‌ రాగా.. డిక్టేటర్‌ సినిమాకు బిలో యావరేజ్‌ టాక్‌ వచ్చేసింది. కాని రిజల్టు చూస్తే రచ్చ రచ్చయిపోయింది.

ఈ సినిమాలన్నీ తన టార్గెట్‌ ను వసూలు చేయడానికి కొన్ని ఇంచుల దూరంలో ఉన్నాయంతే. సోగ్గాడే ఒక్కడే పెట్టిన డబ్బులపై విపరీతమైన లాభం తెచ్చే ఛాన్సుంది. ఎక్స్‌ ప్రెస్‌ రాజా కూడా కొన్ని లాభాలు తెస్తాడు. కాని నాన్నకుప్రేమతో - డిక్టేటర్‌ లు మాత్రం.. ఓవరాల్‌ కు నిర్మాతలకు 4-5 కోట్లు లాభం తెస్తారేమో అంతే. ఒక లోకల్‌ పంపిణీదారుడికి చూస్కుంటే.. ఒక 10-20 లక్షల ప్రాఫిట్టే వస్తుంది. సర్లే.. అసలు ఈ సక్సెస్‌ ఎలా పాజిబుల్‌ అయ్యింది?

అబ్బే ఏమీ లేదు.. ముందు ఒక మాంచి సీజన్‌ కావాలి. అందుకు సంక్రాంతి ప్లస్‌ అయ్యింది. ఆ తరువాత రెండు వారాలు టైమ్‌ కావాలి. చక్కగా దొరికేసింది. అసలు ఈ సినిమాలన్నీ వచ్చిన మరువారం ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కాకపోవడం విడ్డూరం. దానికంటే ముందు.. అన్ని సినిమాలకూ ఫుల్లుగా ధియేటర్లు దొరికేశాయ్‌. ఎందుకంటే అప్పటికే ఉన్న సినిమాల్లో ఒక్కటి కూడా ఆడుతున్న సినిమా లేదు. ఏదో నేను శైలజ ఒక్కటే సో సో గా బండి లాగిస్తూ ఉంది.

ఆ విధంగా సంక్రాంతి సినిమాలన్నీనక్కతోకను తొక్కి వచ్చేశాయ్‌ అనే చెప్పాలేమో. ఏదేమైనా అందరూ సక్సెస్‌ అయితే ఇండస్ర్టీలో ఇన్వెస్టర్లు పెరుగుతారు.. సినిమాలు తీసే పర్సంటేజ్‌ పెరుగుతంది.. ఎక్కువమందికి ఉపాది దొరుకుతుంది. వెల్‌ డన్‌.