Begin typing your search above and press return to search.

కొత్త ఏడాదిలో కొత్తగా ఉంటే కాసుల వర్షమే

By:  Tupaki Desk   |   25 Jan 2016 6:51 AM GMT
కొత్త ఏడాదిలో కొత్తగా ఉంటే కాసుల వర్షమే
X
2015ని టాలీవుడ్ కి చాలా కీలకమైన సంవత్సరంగా చెప్పాలి. బాహుబలి, శ్రీమంతుడుతో పాటు కంచె లాంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే సమయంలో రొటీన్ అనిపించే సినిమాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. అఖిల్ - బ్రూస్ లీ - శివం లాంటి మూవీస్ ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది కూడా కొత్త కంటెంట్ అనే మాటకే ప్రేక్షకులు ఓటేస్తుండడం విశేషం.

2016 ప్రారంభంలోనే నేను.. శైలజ.. మూవీతో విభిన్నంగా వచ్చాడు హీరో రామ్. తన ఎనర్జీ మినహాయిస్తే, ఏ రకంగానూ రామ్ గతంలో చేసిన సినిమాలతో పోల్చే అవకాశం ఈ సినిమాకు లేదు. దీంతో న్యూ ఇయర్ రోజునే వచ్చి ఏడాది ప్రారంభంలోనే సక్సెస్ సాధించేసింది. ఆ తర్వాత సంక్రాంతి పండక్కి ఎప్పుడూ లేని స్థాయిలో నాలుగు సినిమాలు సందడి చేశాయి. బాలకృష్ణ డిక్టేటర్ - నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన - ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో - శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజాలు విడుదలయ్యి.. అన్నీ హిట్ సాధించాయి.

వీటిలో డిక్టేటర్ మినహాయిస్తే, అన్నీ కొత్త కాన్సెప్టులే. రొటీన్ కి భిన్నంగా తీసినవే. అన్నింటీనీ ప్రేక్షకులు ఆదరించడం విశేషం. వీటి డైరెక్టర్లకు కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ మూడు చిత్రాలు భారీ లాభాలను కూడా ఆర్జించాయి. అయితే డిక్టేటర్ సక్సెస్ విషయంలో మాత్రం క్రెడిట్ బాలయ్య ఒక్కడికే దక్కగా, రొటీన్ కంటెంట్ విషయంలో డైరెక్టర్ శ్రీవాస్ కి విమర్శలు ఎదురయ్యాయి. మొత్తంగా చూస్తే కంటెంట్ కొత్తగా ఉంటే, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంత కష్టమేం కాదని ప్రూవ్ చేస్తున్నాయి ఈ సినిమాలు.