Begin typing your search above and press return to search.
సంక్రాంతి ఫైట్ః బన్నీ పోటీలో లేడటగా.. ప్రిన్స్ కు ఎదురులేనట్టేనా?
By: Tupaki Desk | 22 Feb 2021 8:00 AM ISTతెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి ఫెస్టివల్ ను మించిన సీజన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. సినిమా ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్నా.. టిక్కెట్లు ఫుల్లుగా తెగిపోయాన్నది మేకర్స్ ఫీలింగ్. వాస్తవం కూడా అలాగే ఉంటుంది. ఇంటిల్లిపాది పండగ సంబరాల్లో మునిగితేలుతూ ఉంటారు కాబట్టి థియేటర్లు కూడా ప్రేక్షకులతో కళకళలాడుతుంటాయి. అందుకే.. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా టాప్ స్టార్స్ చిత్రాలన్నీ సంక్రాంతి బరిలోనే దిగుతుంటాయి. రాబోయే సంక్రాంతి ఫైట్ ఎలా ఉంటుందనేది టాపిక్ కూడా ఇప్పుడే చర్చలోకి రావడం విశేషం. మరోసారి మహేష్ బాబు, బన్నీ పోటీ పడతారని అనుకున్నప్పటికీ.. లెక్క మారింది!
గత ఏడాది సంక్రాంతి సీజన్లో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ముందుగా రిలీజ్ అయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన తరువాత రోజే అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ థియేటర్లలోకి వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లో నే భారీ విజయంగా నిలిచిన ఈ సినిమా.. దాదాపు 200కోట్ల వసూళ్లు సాధించింది.
కాగా.. మరోసారి ఈ రెండు పుంజులూ సంక్రాంతి పందానికి దిగుతాయనే అనుకున్నారు అందరూ. కానీ.. ఇప్పుడు ఆ ఫైట్ నుంచి అల్లు అర్జున్ తప్పుకోనున్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ వచ్చే సంక్రాంతికి రాబోతున్న విషయమై క్లారిటీ వచ్చేసింది. అదేవిధంగా.. అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా కూడా సంక్రాంతికి వస్తుందనే టాక్ నడిచింది. కానీ.. పరిస్థితులు అనుకూలంగా లేనట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం.. చిరంజీవి ఆచార్యతో కొరటాల బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను మే లో రిలీజ్ చేయబోతున్నారు. ఆ వెంటనే అల్లు అర్జున్ మూవీ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశాడు కొరటాల. కానీ.. ప్లాన్ వర్కవుట్ కావట్లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో తీరికలేకుండా ఉన్నాడు. ఈ మూవీని ఆగస్ట్ లో విడుదల చేసేందుకు ట్రై చేస్తున్నాడు సుకుమార్. కాబట్టి అప్పటి వరకూ ఈ సినిమాతోనే ట్రావెల్ చేస్తాడు బన్నీ. ఆ తర్వాత కొరటాల శివ మూవీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సినిమాను కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి సమయం సరిపోదని భావిస్తున్నారట. అందువల్ల ఆ మూవీకి సమ్మర్ లో స్లాట్ బుక్ చేయాని చూస్తున్నారట మేకర్స్.