Begin typing your search above and press return to search.

శంకరాభరణం ‘ఆ’ ఒబామా కధేనంట

By:  Tupaki Desk   |   24 Sep 2015 2:47 PM GMT
శంకరాభరణం ‘ఆ’ ఒబామా కధేనంట
X
ఒబామా పేరు వినగానే అమెరికా అధ్యక్షుడు గుర్తుకు రావటం మామూలే. అయినా.. ఒక టాలీవుడ్ సినిమాకు ఒబామాకు లింకేందన్న సందేహం అక్కర్లేదు. నిఖిల్ తాజాగా నటిస్తున్న శంకరాభరణం సినిమా ఒబామాకు లింకుందన్న మాట ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న టాక్. అయితే.. ఒబామా అంటే అమెరికా అధ్యక్షుడు కథ కాదని.. ఆ మధ్య హిందీలో రిలీజైన లోబడ్జెట్ మూవీ.. ‘‘పాస్ గయే రే ఒబామా’’ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని తాజా శంకరాభరణాన్ని రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.

కామెడీ థిల్లర్ అయిన ఈ సినిమా హిందీలో పెట్టిన పెట్టుబడులకు భారీగా ఆదాయాన్ని ఇచ్చింది. దీన్ని తీసుకొని కోన వెంకట్ తెలుగు నేటివిటికి అనుగుణంగా భారీగా మార్పులు చేశారని చెబుతున్నారు. నిఖిల్.. నందిని నటిస్తున్న శంకరాభరణం చిత్రం మొత్తం అప్పులు పాలైన ఓ ఎన్ ఆర్ ఐ సినిమాగా చెబుతున్నారు. అప్పుల పాలైన ఓ ఎన్ ఆర్ఐ యువకుడు.. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని అమ్మేందుకు ఇండియాకు రావటం.. ఆ తర్వాత కిడ్నాప్ కు గురి కావటం లాంటి లైన్ తో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కథ విషయంలో చాలా పక్కాగా ఉంటూ.. కొత్తదనం నిండి ఉండే స్ర్కిప్ట్ లను మాత్రమే ఓకే చేస్తున్న నిఖిల్ కు తగినట్లుగా కథా రచయిత మార్పులు చేశారంటున్నారు. నవంబరు మొదటి వారంలో విడుదల కానున్న ఈ సినిమా థ్రిల్లింగ్ కామెడీతో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందంటున్నారు.