Begin typing your search above and press return to search.

వ‌రుణ్‌... కాస్త తేడానే!!

By:  Tupaki Desk   |   12 Feb 2018 11:04 AM GMT
వ‌రుణ్‌... కాస్త తేడానే!!
X
ఫిదా ఇచ్చిన హిట్‌తోనే వరుణ్ ఆనందప‌డుతుంటే... తొలిప్రేమ కూడా మంచి విజ‌యాన్నే అందించింది. ఇంటెలిజెంట్‌ - గాయ‌త్రి సినిమాల మ‌ధ్య‌లో విడుద‌లై... ఆ సినిమా ఒక్క‌టే హిట్ కొట్టింది. ఇందులో ల‌వ‌ర్ బాయ్ గా మ‌ళ్లీ ఆక‌ట్టుకున్నాడు వరుణ్‌. ఫిదాలో కూడా సున్నిత మ‌న‌స్సున్న యువ‌కుడిగా న‌టించి మెప్పించాడు. త‌రువాత చేయ‌బోయే సినిమా మాత్రం పూర్తిగా డిఫ‌రెంట్‌. అందుకేనేమో వరుణ్ కూడా డిఫ‌రెంట్ దారిలో వెళుతున్నాడు.

ఘాజీ ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి వ‌రుణ్ కోసం ఓ స్పేస్ క‌థ‌ను సిద్ధం చేశాడు. అందులో న‌టించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు వ‌రుణ్‌. ఆ సినిమాలో ఎక్కువ భాగం గురుత్వాక‌ర్ష‌ణ శూన్యంగా ఉన్న ప‌రిస్థితుల్లో (జీరో గ్రావిటీ) జ‌రుగుతుంది. అలా జీరో గ్రావిటీ ప‌రిస్థితుల్లో న‌టించేందుకు వ‌రుణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోబోతున్నాడ‌ట‌. ఇందుకోసం క‌జ‌కిస్థాన్ వెళ్ల‌బోతున్నారు వ‌రుణ్ - సంకల్స్ రెడ్డి. వ‌చ్చేనెల‌లో వెళ్లి అక్క‌డ నెల రోజుల పాటూ ఉండి జీరో గ్రావిటీలో ఎలా న‌టించాలో తెలుసుకుని వ‌స్తారుట‌.

తెలుగు హీరోలు సాధార‌ణంలో ఇలా ట్రైనింగ్‌ లేవీ తీసుకోకుండానే న‌టిస్తారు. ఏ పాత్ర అయినా అప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాంట్‌ గా చేసేస్తారు. కానీ వరుణ్ చాలా డిఫ‌రెంట్ గా ఉన్నాడు. ప‌ద్ద‌తి ప్ర‌కారం చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతున్న‌ట్టున్నాడు. అందుకే ఇలా నెల క‌జ‌కిస్తాన్‌ లో ఉండ‌డం, అక్క‌డ శిక్ష‌ణ తీసుకోవ‌డం వంటి వ‌న్నీ. మ‌రి అక్క‌డ మెగా హీరోకు శిక్ష‌ణ ఇచ్చే వారెవ‌రో మాత్రం తెలియ‌దు. మొత్త‌మ్మీద మ‌రో హిట్ కొట్ట‌డానికి అప్పుడే పునాదులు వేసేస్తున్నాడు వ‌రుణ్‌.