Begin typing your search above and press return to search.

బాహుబలి కన్నా 6.25 కోట్లు తక్కువే

By:  Tupaki Desk   |   1 July 2018 7:28 AM GMT
బాహుబలి కన్నా 6.25 కోట్లు తక్కువే
X
ఇండియాలో అతి పెద్ద మార్కెట్ ఉన్న ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్. ఇండియాలో కలెక్షన్ రికార్డులన్నీ ఆ ఇండస్ట్రీకి చెందిన సినిమాల మీదే ఉండేవి ఒకప్పుడు. అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లు వసూళ్ల మోత మోగించేవాళ్లు. ఓపెనింగ్స్ దగ్గర్నుంచి ఫుల్ రన్ వసూళ్ల వరకు అన్ని రికార్డులూ వీళ్ల పేరు మీదే ఉండేవి. కానీ మన దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ‘బాహుబలి’ అన్ని రికార్డులన్నీ చెరిపేసింది. కొత్త రికార్డులు నెలకొల్పింది. అందులోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ అయితే మామూలు మోత మోగించలేదు. కనీ వినీ ఎరుగని స్థాయిలో రికార్డులు నెలకొల్పింది ఈ చిత్ర ఫుల్ రన్ వసూళ్ల గురించి వేరే బాలీవుడ్ సినిమా ఏదీ అసలు ఆలోచించే పరిస్థితి లేదు. ఫుల్ రన్ కలెక్షన్ల సంగతలా ఉంచితే ఓపెనింగ్స్ విషయంలోనూ ‘ది కంక్లూజన్’ దరిదాపుల్లోకి రావట్లేదు కొత్త సినిమాలేవీ.

ఈ శుక్రవారం రిలీజైన ‘సంజు’ సినిమా ఈ ఏడాది ఓపెనింగ్ డే బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్‌ గా నిలిచింది. ఆ చిత్రం తొలి రోజు రూ.34.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ తొలి రోజు వసూళ్లతో పోలిస్తే ఈ మొత్తం రూ.6.25 కోట్లు తక్కువే కావడం గమనార్హం. ‘ది కంక్లూజన్’ రూ.41 కోట్లు వసూలు చేసింది మొదటి రోజు. ఇక ఓపెనింగ్ వీకెండ్.. ఓపెనింగ్ వీక్ వసూళ్ల గురించి అసలు మాట్లాడే పరిస్థితి లేదు. ఆ చిత్రం ఫుల్ రన్లో ఏకంగా రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వేరే హీరోలైతే ఇప్పుడిప్పుడే ‘బాహుబలి’ రికార్డుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఐతే చైనాలో భారీగా మార్కెట్ సంపాదించుకున్న అమీర్ ఖాన్.. తన కొత్త సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో బాహుబలి రికార్డుల మీద గురి పెట్టేందుకు అవకాశాలున్నాయి.