Begin typing your search above and press return to search.

‘సంజు’ సంచలనం.. ఇన్ని కోట్లా.?

By:  Tupaki Desk   |   30 Jun 2018 11:13 PM GMT
‘సంజు’ సంచలనం.. ఇన్ని కోట్లా.?
X

సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘సంజు’. హిరాణీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటిరోజు వసూళ్లలో సంజు సంచలనం సృష్టిస్తోంది. సినిమాపై జనాల్లో విపరీతమై హైప్ ను సృష్టించడంతో థియేటర్ల ముందు క్యూలు కడుతున్నారు. సంజు సినిమా తొలిరోజు దేశ వ్యాప్తంగా 34 కోట్ల 75 లక్షల రూపాయల నెట్ సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన ఈ ఏడాది ఇదే అతిపెద్ద విజయం అని చెబుతున్నారు.

మొదటిరోజు అత్యధిక వసూళ్లను పరిగణలోకి తీసుకొని చూస్తే ఈ ఏడాది రేస్-3 మూవీ ఇప్పటివరకూ నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఆ తర్వాత బాగి2, పద్మావత్ 2,3వ స్థానాల్లో ఉన్నాయి. సల్మాన్ నటించిన రేస్3కి తొలిరోజు 29 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అలాగే బాగి-2 కు 25కోట్లు, పద్మావత్ కు 20 కోట్ల వసూళ్లు దక్కాయి. ఇప్పుడు సంజు సినిమా ఏకంగా తొలిరోజే 34 కోట్లు వసూళ్లు చేయడంతో రేస్-3 మూవీ రెండో స్థానానికి పడిపోయింది.

సంజు సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణం ట్రైలర్ లో చూపించిన మసాలా డైలాగే.. సంజయ్ దత్ 308 మందితో ఎలా డేటింగ్ చేశాడు.? వాళ్లందరిని దశలవారీగా ఎలా మెయింటేన్ చేశాడనే విషయాలను సినిమాలో చూపిస్తారని జనం ఆశపడి థియేటర్ కు వచ్చారు. అందుకే తొలిరోజే థియేటర్లన్నీ నిండిపోయాయి. 34 కోట్లు వసూళ్లయ్యాయి. కానీ అది కేవలం డైలాగ్ కు మాత్రమే వాడారని సినిమా చూసిన జనం పెదవి విరుస్తున్నారు. దీనికి తోడు కంటెంట్ పై విమర్శలు చెలరేగాయి. దీంతో రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే చాన్స్ ఉంది.