Begin typing your search above and press return to search.

బాహుబలి రికార్డు బద్దలైంది

By:  Tupaki Desk   |   2 July 2018 8:04 AM GMT
బాహుబలి రికార్డు బద్దలైంది
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లు చూశాక దాన్ని కొట్టే సినిమా ఇప్పుడిప్పుడే వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్ సినిమాలకే ‘బాహుబలి’ రికార్డులు అందని విధంగా ఉండటంతో వేరే హీరోల సినిమాలు వచ్చినపుడు రికార్డుల గురించి మాట్లాడే పరిస్థితే కనిపించడం లేదు. మామూలుగా చూస్తే రణబీర్ కపూర్ సినిమా అంటే రికార్డుల గురించి అసలే పట్టించుకోవాల్సిన పని ఉండదు. కానీ ఈసారి రణబీర్.. రాజ్ కుమార్ హిరానితో కలిసి బరిలోకి దిగాడు. దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న హిరాని అంటే ప్రేక్షకులకు మామూలు గురి లేదు. రణబీర్-హిరాని కలయికలో తెరకెక్కిన ‘సంజు’ సినిమా ఆసక్తికర ప్రోమోలతో జనాల్లో అంచనాలు పెంచింది. అందుకు తగ్గట్లే ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తున్నాయి.

తొలి రోజే రూ.34.75 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఈ ఏడాది ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందీ చిత్రం. ఐతే తొలి రోజు ‘బాహుబలి: ది కంక్లూజన్’ రికార్డును అందుకోలేకపోయిన ‘సంజు’.. మూడో రోజు మాత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఒక్క రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి-2’ పేరిట ఉన్న రికార్డును అది బద్దలు కొట్టేసింది. మూడో రోజైన ఆదివారం ‘బాహుబలి-2’రూ.46.50 కోట్లతో రికార్డు నెలకొల్పగా.. దాన్ని స్వల్ప తేడాతో ‘సంజు’ అధిగమించింది. ఈ చిత్రానికి ఆదివారం రూ.46.71 కోట్ల గ్రాస్ వచ్చింది. రణబీర్ లాంటి హీరోతో ఇలాంటి రికార్డు కొట్టిన హిరానికి సెల్యూట్ కొట్టాల్సిందే. ‘సంజు’ మూడో రోజుల్లో మొత్తంగా రూ.120 కోట్ల మార్కును దాటేయడం విశేషం. ఫుల్ రన్లో ఈ చిత్రం సునాయాసంగా రూ.300 కోట్ల మార్కును దాటేస్తుందని.. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.