Begin typing your search above and press return to search.

#మీటూ: డైరెక్టర్ ను క్షమాపణ కోరిన నటి

By:  Tupaki Desk   |   14 Nov 2018 5:57 AM GMT
#మీటూ: డైరెక్టర్ ను క్షమాపణ కోరిన నటి
X
ఇండియా అంతటా #మీటూ కాంపెయిన్ ప్రస్తుతం జోరందుకున్న విషయం తెలిసిందే. సినీపరిశ్రమలో పలువురు హీరోయిన్లు తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ మీటూ ఉద్యమంలో తమ పాత్ర పోషిస్తున్నారు. ఓ మూడు వారల క్రితం కన్నడ హీరోయిన్ సంజన గల్రాని డైరెక్టర్ రవి శ్రీవత్స పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తన డెబ్యూ ఫిలిం 'గండ హెండతి' (హిందీ సినిమా మర్డర్ రీమేక్) షూటింగ్ సందర్భంగా దర్శకుడు తనను వేధించాడని ఆరోపించింది.

లిప్ లాక్ సీన్లలో నటించమని.. ఇంటిమేట్ సీన్లు చెయ్యమని బలవంతం చేశాడని.. వాటి చిత్రీకరణను కావాలని ఎక్కువ రోజులు జరిపాడని ఆరోపించింది. "కథ వినిపించిన సమయంలో ఒక కిస్ ఉందని చెప్పాడు. కానీ అది ఫైనల్ గా 15 రొమాంటిక్ సీన్స్ వరకూ వెళ్ళింది. అదేంటని నేను ప్రశ్నిస్తే నన్ను అరవడమే కాకుండా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ సినిమా అవుట్ పుట్ చూసి మా నాన్న సిగ్గు పడ్డాడు. జనాలు నేనే కావాలని ఆ సినిమా సీన్స్ చేశారని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు."

ఈ విషయంపై రవి శ్రీవత్స కర్ణాటక ఫిలిం ఛాంబర్ కు డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేస్తూ ఆమె ఆరోపణల వల్ల తన రెప్యుటేషన్ దెబ్బ తిన్నదని.. ఆమెపై చర్య తీసుకోవాలని కోరాడు. దీంతో కన్నడ పరిశ్రమ లోని సీనియర్లు అయిన అంబరీష్.. రాక్ లైన్ వెంకటేష్.. రూప అయ్యర్ ఈ వివాదం పరిష్కరించేందుకు పూనుకున్నారు. అంబరీష్ నివాసం లో జరిగిన మీటింగ్ లో సంజన డైరెక్టర్ శ్రీవత్స కు క్షమాపణలు తెలిపిందట. తనకు జరిగిన ఇబ్బందిని #మీటూ వేదిక ద్వారా తెలపాలని అనుకుందే గానీ ఎవరినీ నొప్పించడం తన అభిమతం కాదని చెప్పిందట.

ఏదేమైనా #మీటూ కాంపెయిన్ లో ఇది పెద్ద ట్విస్ట్. ఎవరిమీదైతే ఆరోపణలు చేసిందో వారికే బాధితురాలు క్షమాపణలు చెప్పడం ఇది #మీటూ లో మొదటి సారి. ఈ సంఘటన #మీటూ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.