Begin typing your search above and press return to search.

ఆమె మెంటల్‌.. తినే పళ్లెంలో ఉమ్మే రకం

By:  Tupaki Desk   |   4 Sept 2020 10:30 PM IST
ఆమె మెంటల్‌.. తినే పళ్లెంలో ఉమ్మే రకం
X
ఇన్నాళ్లు కంగనా ఎంతగా విమర్శలు చేసినా కూడా సినీ ప్రముఖులు మౌనంగా ఉండేవారు. ఆమె వ్యాఖ్యలు విమర్శలు అలవాటుగా చేసుకున్న బాలీవుడ్‌ వారు ఆమెకు కౌంటర్‌ ఇవ్వడం మానేశారు. ఆమద్య ఆలియా భట్‌ ను అత్యంత నీచమైన పదాలతో కంగనా మరియు ఆమె సోదరి విమర్శలు చేసినా ఆలియా మాత్రం మౌనంగానే ఉంది. ఆమె చేసే విమర్శలకు కౌంటర్‌ ఇస్తే మరింత రెచ్చి పోయి విమర్శలు చేస్తుంది అనేది అందరి అభిప్రాయం. కాని రాజకీయ నాయకులు మాత్రం అలా కాదు. ఆమెతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాటల యుద్దం చేస్తున్నారు.

ఇటీవల అధికార పార్టీ యువ నేతపై కంగనా ఆరోపణలు చేసి ముంబయి పోలీసు వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేసింది. దాంతో ఆమె ముంబయిలో అడుగు పెట్టవద్దంటూ చాలా మంది హెచ్చరించారు. ముఖ్యంగా శివసేన ముఖ్య నాయకులు కూడా ముంబయి పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబయిలో అడుగు పెట్టవద్దంటూ సూచించారు. వారి వ్యాఖ్యలకు కంగనా మరింత సీరియస్ అయ్యింది. నన్ను ముంబయిలో అడుగు పెట్టవద్దు అనడానికి మీరు ఎవరు అంటూ ఛాలెంజ్‌ చేసింది.

తాజాగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పరుష పదజాలంతో కంగనాపై విమర్శలు గుప్పించాడు. ఆమె ఒక మెంటల్‌ కేసు. తినే పళ్లెంలో ఉమ్మే రకం. ఆమెకు విశ్వాసం అనేది ఉండదు. ఆమె వెనుక కొన్ని రాజకీయ పార్టీలు పక్షాలు ఉండి నడిపిస్తున్నాయి అంటూ ఆరోపించాడు. ఆమె విమర్శల వెనుక రాజకీయ కోణం కూడా ఉందంటూ శివసేన నాయకులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంను అస్థిర పర్చి పడగొట్టే ప్రయత్నం కూడా ఆమె చేస్తుందేమో అంటూ నెటిజన్స్‌ మరికొందరు కంగనాపై ఆరోపణలు చేస్తున్నారు.