Begin typing your search above and press return to search.

క‌ళాత్మ‌క ద‌ర్శ‌కుడు డిజిట‌ల్ ఆరంగేట్రంపై ఉత్కంఠ‌

By:  Tupaki Desk   |   17 Dec 2020 6:00 PM IST
క‌ళాత్మ‌క ద‌ర్శ‌కుడు డిజిట‌ల్ ఆరంగేట్రంపై ఉత్కంఠ‌
X
త‌న‌దైన అభిరుచితో అద్భుత‌ క‌ళాఖండాల్ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా సంజ‌య్ లీలా భ‌న్సాలీకి పేరుంది. భారీత‌నం నిండిన హిస్టారిక‌ల్ కాన్సెప్టుల‌తో సినిమాలు తీసి సంచ‌ల‌నాలు సృష్టించిన అరుదైన ద‌ర్శ‌కుడిగా త‌న‌కు గుర్తింపు ఉంది. ఆయ‌న‌తో ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్ట్ కోసం డిజిట‌ల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

దీంతో బాలీవుడ్ ద‌ర్శ‌క‌ నిర్మాత భ‌న్సాలీ తొలి డిజిటల్ సిరీస్ కి రంగం సిద్ధ‌మ‌వుతోందని క‌థ‌నాలొస్తున్నాయి. భన్సాలీ ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ `హీరా మండి` స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈ ప్రాజెక్ట్ 2021 మొదటి అర్థ‌భాగంలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఈలోగానే భ‌న్సాలీ డిజిటల్ దిగ్గజం నెట్ ‌ఫ్లిక్స్ తో ఒక భారీ పీరియడ్ డ్రామాను వెబ్-ఫిల్మ్ గా రూపొందించాలని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. సంజయ్ ‌తో పాటు ప్రముఖ చిత్రనిర్మాత విభూ పూరి కూడా భాగ‌స్వామి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన జనవరి నెలలో విడుదల కానుంది. ఒక‌వేళ భ‌న్సాలీ వెబ్ ఫిలిం రేస్ లోకి దిగితే రాజీ అన్న‌దే లేకుండా ఇక్క‌డా సంచ‌ల‌నాల‌కు తెర తీస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.