Begin typing your search above and press return to search.

వాళ్ళని తిరగొద్దంటున్న డైరక్టర్

By:  Tupaki Desk   |   22 Aug 2017 9:01 AM GMT
వాళ్ళని తిరగొద్దంటున్న డైరక్టర్
X
బాలీవుడ్ లో తారల మధ్య ఆ రిలేషన్ ఉందంటూ.. వచ్చే పుకార్లు అన్ని ఇన్ని కావు. సాధారణంగా ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ ఉంటాయని అందరికి తెలిసిన విషయమే కానీ బాలీవుడ్ లో మాత్ర ఆ డోస్ కాస్త ఎక్కువాగా ఉంటుంది. ఎంతగా అంటే ఎన్ని రూమర్స్ వచ్చినా హీరో- హీరోయిన్స్ అస్సలు పట్టించుకోరు. ఇష్టం వచ్చినట్టు చెట్టాల్ పట్టాల్ అంటూ చివరకు ఏదో ఒక రోజు కెమెరా కంటపడే వరకు వస్తారు.

ఇప్పుడు అదే తరహాలో ఓ బాలీవుడ్ లో జంట తెగ తిరిగేస్తూ.. ఓపెన్ గానే తమ రిలేషన్ గురించి ప్రకటించిన దీపికా రన్ వీర్ ఉన్నారు చూడండి.. వారితోనే అసలు సమస్య. వీరి కలయిక ఓ దర్శకుడిని తెగ ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. 2015 లో వచ్చిన రామ్ -లీల సినిమాలతో ఒకటైన దీపిక పదుకొణె మరియు రన్ వీర్ ప్రస్తుతం సంజయ్ బన్సాలి దర్శకత్వం వహిస్తున్న "పద్మావతి" సినిమాలో నటిస్తున్నారు. అయితే వీరిమధ్య ఈ సినిమాలో రొమ్మాంటిక్ సీన్స్ అస్సలు ఉండవట. దీంతో అభిమానుల నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కానీ బయట మాత్రం లవ్ సీన్స్ తో తెగ రెచ్చిపోతున్నారని టాక్.

ఇప్పటికే సీక్రెట్ లవ్ స్టోరీని నడిపిస్తున్నారని విమర్శలను ఎదుర్కొన్న ఈ జంట ఈ మధ్య ఇంకా రెచ్చిపోతున్నారట. ఎంతగా అంటే రన్ వీర్ తన పుట్టిన రోజు సందర్బంగా అర్ధరాత్రి కార్ లో లాంగ్ రైడ్ కి తీసుకెళ్లేంత. ఇప్పటికి కూడా వీరి జంట ఇలాగే కొనసాగుతుండడంతో దర్శకుడు సంజయ్ చాలా కోపంతో ఉన్నాడట. మీరు ఎలా తిరిగినా నాకు సంబంధం లేదు కానీ సినిమాలో నటిస్తున్నంత వరకు కొంచెం లిమిట్స్ లో ఉండండి.. లేదంటే మీ మధ్య ఫీల్ పోతుంది.. అలాగే సినిమా ప్రమోషన్లకు అది నెగెటివ్ అవుతుంది అని ఓ మాట కూడా చెప్పాడట. అది సంగతి.