Begin typing your search above and press return to search.

దీపికా ఫోటోలు.. డైరెక్టర్ హర్ట్

By:  Tupaki Desk   |   16 Jun 2017 8:09 AM GMT
దీపికా ఫోటోలు..  డైరెక్టర్ హర్ట్
X
బాలీవుడ్ లో ఇప్పుడు మరో ప్రేమకావ్యం రాబోతుంది. ఈ ప్రేమ జంట కూడా నిజ జీవిత ప్రేమ జంటే కావడం అందరి ధృష్టి ఇట్టే ఆకర్షించింది. ఆ సినిమానే సంజయ్ లీల భన్శాలి నిర్మిస్తున్న చరిత్ర లో గొప్పగా మిగిలిపోయిన ‘పద్మావతి’ ప్ఏమ. పద్మావతి సినిమా షూటింగ్లో గొడవలు ఇప్పుడు పూర్తిగా సమసిపోయాయి అనే చెప్పలి. ఆ మధ్య ఒక హిందూ వర్గం వాళ్ళు సెట్ పై దాడి చేసి నానా గొడవపెట్టి డైరెక్టర్ భన్శాలి పై కూడా అవమానపరిచారు. ఇప్పుడు అన్నీ బాగానే నడుస్తున్నాయి, షూటింగ్ కూడా జరుగుతున్నా టైమ్ లో తన ఫోటో తో దీపిక షాక్ ఇచ్చింది.

ఈ మధ్య దీపికా పదుకొనె మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కవర్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. దీనిలో దీపికా తన ఫిగర్ ని చూపిస్తూ సోఫా పైన యాక్షన్ సినిమా వాంప్ హీరోయిన్ లా కనిపించేసరికి డైరెక్టర్ సంజయ్ లీల భన్శాలికి కోపం వచ్చిందిట. ఈమె చేస్తున్న సినిమా ఏంటి అక్కడ చేస్తున్న ఫోటో షూట్లు ఏంటి అని ఆయన దీపికా పై చిరుబుర్రులు ఆడుతున్నారు అని టాక్. దీపికా ఇలాంటి ఫోటో షూట్ చేయడం ఆమెకి కొత్త కాదు కాని.. కాకపోతే పద్మావతి సినిమా పూర్తి అయినంత వరకు ఆగి ఉండవలిసింది అతను అభిప్రాయపడ్డారు. చరిత్రలో గొప్పగా మిగిలిపోయాన పాత్రను పోషిస్తున్నప్పుడు మనం కూడా కొంత వాళ్ళలాగా కనిపిస్తే సినిమాకు ఉపయోగపడుతుందని డైరక్ట్ ఫీలింగట.

దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ - షాహిద్ కపూర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ప్రేమగాధ ‘పధ్మవతి’ ని సంజయ్ లీల భన్శాలి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేసి రాచరికపు హుందా ఉట్టిపడేలాగా నిర్మిస్తునట్లు తెలుస్తుంది. నవంబర్ మాసం లో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు అని తెలుస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/