Begin typing your search above and press return to search.
మరో దేవదాస్ రెడీ అవుతున్నాడా?
By: Tupaki Desk | 12 May 2021 9:00 AM ISTబాలీవుడ్ లో ఆల్ టైమ్ సూపర్ హిట్ చిత్రాల జాబితాలో షారుఖ్ ఖాన్ నటించిన 'దేవదాస్' మూవీ ఉంటుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా క్లాసిక్ గా నిలిచి పోయింది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ నిలవడంతో పాటు ఎంతో మంది స్టార్స్ ను ఇండస్ట్రీకి తీసుకు వచ్చాడు. అలాంటి సంజయ్ లీలా భన్సాలీ తో మళ్లీ షారుఖ్ ఖాన్ సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో మరో ప్రతిష్టాత్మక సినిమా పట్టాలెక్కబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. దేవదాస్ అభిమానులను ఊరిస్తున్న ఈ వార్త పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
జీరో సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ రెండేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ఎట్టకేలకు పటాన్ ను యశ్ రాజ్ బ్యానర్ లో చేస్తున్న సమయంలో కరోనా కారణంగా నిలిచి పోయింది. పటాన్ మళ్లీ ఎప్పటికి ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు. వచ్చే ఏడాదికి షారుఖ్ ఖాన్ పటాన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేవదాస్ కాంబోలో మూవీ చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పటాన్ తర్వాత షారుఖ్ ఖాన్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సినిమా చేయడం దాదాపుగా ఖాయం అంటూ బాలీవుడ్ మీడియా వర్గాలు కథనాలు ఇస్తున్నాయి.
పటాన్ సినిమాతో పాటు భన్సాలీ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ నటించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా షారుఖ్ ప్లాన్ చేస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఈ రెండు సినిమాలపై అంచనాలు ఉంటాయి. ఈ రెండు సినిమాలతో మళ్లీ షారుఖ్ మళ్లీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు మరియు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.