Begin typing your search above and press return to search.

ఆ వెబ్‌ సిరీస్ వల్ల పాక్‌ తో పెంట ఖాయం!

By:  Tupaki Desk   |   5 Oct 2021 9:00 PM IST
ఆ వెబ్‌ సిరీస్ వల్ల పాక్‌ తో పెంట ఖాయం!
X
బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ. ఈయన కెరీర్‌ లో చాలా వివాదాస్పద సినిమాలు ఉన్నాయి. ఛారిత్రాత్మక విషయాలను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు ఆయన చాలా సినిమాలను చేయడం జరిగింది. అందులో భాగంగా పద్మావత్ ఒకటి. ఆ సినిమా చాలా వివాదాలను మూట కట్టుకుంది. రామ్‌ లీల సినిమా విషయంలో కూడా చాలా వివాదాలు నడిచాయి. ప్రస్తుతం గంగూబాయ్ కథియావాడి సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమా కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆలియా భట్ పాత్ర పై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆడవారిని చూపించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఆ సినిమా తర్వాత సంజయ్ లీలా భన్సాల్సీ చేయబోతున్న ప్రాజెక్ట్‌ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సంజయ్ లీలా భన్సాలీ చాలా కాలంగా పాకిస్తాన్ లోని హీరామండీ ప్రాంతం గురించి ఒక సినిమాను తీయాలని ఆశ పడుతున్నాడు.

పాకిస్తాన్ లోని హీరామండికి ఛారిత్రాత్మక నేపథ్యం ఉంది. పూర్వ కాలంలో హీరామండి ప్రాంతంలో మొఘల్ రాజులు తమకు నచ్చిన మహిళలను తీసుకు వచ్చి బంధించే వారు. రాష్ట్రం నలుమూల నుండి మహిళలు అక్కడ బంధీలుగా ఉండే వారు. బంధీలుగా ఉన్న అందమైన ఆడవారితో రాజు మరియు రాజ కుటుంబంకు చెందిన వారు శారీరక సుఖాలను ఆస్వాదించే వారు. ఆ తర్వాత తర్వాత కాలంలో కూడా హీరామండి ప్రాంతం అలాగే ఉండి పోయింది. రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి కాని హీరామండి మరియు అక్కడ జరిగే కార్యక్రమాలు అలాగే ఉండి పోయాయి. హీరా మండి ఒక రెడ్ లైట్‌ ఏరియా మాదిరిగా మారి పోయింది. అక్కడ వందల మంది వేశ్యలు ఉంటారు. అక్కడకు వెళ్తే రాజభోగాలు రుచి చూపించేందుకు ఎంతో మంది వేశ్యలు సిద్దంగా ఉంటారు. దేశ విదేశాల నుండి కూడా అక్కడకు వెళ్లే వారు చాలా మంది ఉంటారు అనే టాక్ ఉంది.

ఆ ప్రాంతం గురించి సంజయ్ లీలా భన్సాలీ సినిమా తీయాలని ఆశ పడ్డాడు కాని అది కుదరలేదు. దాంతో అదే కాన్సెప్ట్ తో వెబ్‌ సిరీస్‌ ను చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. అందుకోసం బాలీవుడ్‌ లేడీ సూపర్ స్టార్స్ అయిన ఐశ్వర్య రాయ్‌.. దీపిక పదుకునే.. మాధురి దీక్షిత్‌.. ఆలియా భట్‌.. సోనాక్షి సిన్హా.. పరిణితి చోప్రా వంటి ప్రముఖులను ఎంపిక చేయడం జరిగింది. స్క్రిప్ట్‌ వర్క్ కూడా పూర్తి అయ్యిందని.. షూటింగ్‌ ప్రారంభించడమే తరువాయి అంటున్న సమయంలో కొందరు ఆ వెబ్‌ సిరీస్ ను తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ లోని ఆ పాత్రం గురించి తప్పుగా చూపించడం అనేది ఆ దేశంను మరియు అక్కడి వారిని కించ పర్చడం అవుతుంది. అందుకే ఆ ప్రయత్నం చేయడం మానుకోవడం మంచిది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ ఒక వేలా ఆ ప్రయత్నంను కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఇండియాపై పడే అవకాశాలు చాలా ఉన్నాయని.. వారు మన హిందూ పురాణాలను మొదలుకుని ప్రముఖ కట్టడాలపై కూడా తప్పుడు కథలతో సినిమాలు తీసినా ఆశ్చర్యం లేదు. అందుకే సంజయ్ లీలా భన్సాలీ ఆ నిర్ణయం వెనక్కు ఈసుకుంటే మంచిదని.. లేదంటే పాకిస్తాన్‌ తో పెంట ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సంజయ్ లీలా భన్సాలీ నిర్ణయం ఏంటీ అనేది ఒకటి రెండు నెలల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.