Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 30 : ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యే ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

By:  Tupaki Desk   |   14 April 2020 12:00 PM IST
ఎన్టీఆర్‌ 30 : ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యే ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌
X
ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. అది వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్‌ ఎప్పుడు పూర్తి అయ్యే విషయమై క్లారిటీ లేదు. అయినా కూడా ఎన్టీఆర్‌ తన తర్వాతి చిత్రంకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఎన్టీఆర్‌ తదుపరి చిత్రంకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ ఇంకా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ లు సంయుక్తంగా ఎన్టీఆర్‌ 30ను నిర్మించబోతున్నాయి.

ఈ విషయాల వరకు అధికారికంగా ప్రకటన వచ్చింది. కాని తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఈ చిత్రంలో విలన్‌ పాత్ర కోసం సంజయ్‌ దత్‌ తో త్రివిక్రమ్‌ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన విషయాలు ఏవీ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సినిమాలో ఒక కన్నింగ్‌ పొలిటీషియన్‌ పాత్ర ఉంటుందట. ఆ పాత్రకు గాను సంజయ్‌ దత్‌ అయితే బాగుంటాడనే అభిప్రాయంతో త్రివిక్రమ్‌ ఉన్నాడట. ఈ వార్తలు నందమూరి ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం ఆయన సౌత్‌ సినిమా కేజీఎఫ్‌ 2 లో నటిస్తున్నాడు. కనుక ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. త్రివిక్రమ్‌ మాత్రమే కాకుండా సుకుమార్‌ కూడా తన ‘పుష్ప’ చిత్రం కోసం బన్నీకి ఆపోజిట్‌ గా సంజయ్‌ దత్‌ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి సంజయ్‌ దత్‌ ఈ రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్తాడా చూడాలి.