Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమాకి సంజూ భాయ్ సైన్ చేశాడా...?

By:  Tupaki Desk   |   17 April 2020 12:00 PM IST
ఎన్టీఆర్ సినిమాకి సంజూ భాయ్ సైన్ చేశాడా...?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఈ చిత్రానికి ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుండి రోజుకొక రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రకరకాల పేర్లు అయితే వినిపిస్తూ వచ్చాయి కానీ ఎవరి పేరును ఇంకా ఫైనల్ చేయలేదు. ఇంతక ముందు జాన్వీ కపూర్, పూజాహెగ్డే అన్నారు. ఇప్పుడు రష్మిక మదన్న అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది.

అదేంటంటే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నటించనున్నారట. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. సంజయ్‌ దత్‌కు త్రివిక్రమ్‌ ఫోన్ ద్వారా స్టోరీ నెరేట్‌ చేసినట్లు.. ఎన్టీఆర్‌ పాత్రకు సరిసమానంగా ఉండే పవర్‌ ఫుల్‌ పాత్ర కావడంతో సంజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ పై సంజూ భాయ్ ఆల్రెడీ సైన్ కూడా చేసారని.. అయితే చిత్ర యూనిట్ ఆఫీసియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా సంజయ్ దత్ ఇంతముందు నాగార్జున హీరోగా నటించిన 'చంద్రలేఖ' సినిమాలో గెస్ట్ రోల్ చేసాడు.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ కి ఇది మరో పాన్ ఇండియా మూవీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సంజయ్‌ ‘కేజీఎఫ్‌ 2’లో నటిస్తున్నారు... ఎన్టీఆర్‌ ఏమో ఆర్‌ఆర్‌ఆర్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. దానితో త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాని కూడా ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ - చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ సినిమా చెప్పిన సమయానికి రిలీజ్ అయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.