Begin typing your search above and press return to search.

భర్త బిగి కౌగిట్లో.. వాటే సీన్

By:  Tupaki Desk   |   8 Sept 2017 9:54 AM IST
భర్త బిగి కౌగిట్లో.. వాటే సీన్
X
దాంపత్య జీవితంలో ఏ ఒక్కరు తప్పటడుగు వేసినా అది వారి ఇద్దరి జీవితంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో అయితే ఈ తరహా ధోరణి చాలానే కనిపిస్తోంది. ఎంత తొందరగా దగ్గరవుతారో అంతే తొందరగా విడిపోయి జీవితాల్ని ప్రశ్నార్థకంగా మార్చుకుంటారు. కానీ కొందరు పరిస్థితులు ఎలా ఉన్నా అర్థం చేసుకొని హ్యాపీగా జీవిస్తుంటారు.

ఇపుడు అదే తరహాలో సంజయ్ దత్ దంపతులు హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్రమయుధాలు సరఫరా చేశాడనే నేరంతో జైలు శిక్షను అనుభవించిన సంజయ్ ఎన్ని కష్టాలు పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట ఇద్దరి భార్యలతో విభేదాలు వచ్చి విడిపోయిన సంజయ్ తన ప్రస్తుత భార్య తో మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదిలిపెట్టలేదు. అయితే సంజయ్ భార్య మాన్యత కూడా అతన్ని వదిలిపెట్టలేదు జైలు నుంచి విడుదలయ్యే వరకు ఎంతో ఆశగా ఎదురుచూసింది.

అయితే రీసెంట్ గా ఈ ఇద్దరు దిగిన ఒక లవ్లీ ఫోటో నెటీజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉండే మన్యత దత్ తన భర్త బిగి కౌగిట్లో ప్రేమగా సేద తీరుతున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సంజయ్ వెనక నుంచి ఆమెను ఎంతో ప్రేమగా హద్దుకోవడం చూస్తుంటే ఎంత ప్రేమగా ఉంటున్నారో అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సంజయ్ తన స్వేచ్ఛ జీవితాన్ని ఫ్యామిలీతో హ్యాపి గా గడుపుతూ.. తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటున్నాడు.