Begin typing your search above and press return to search.

ఖల్ నాయక్ కూతురి సూపర్ రిటార్ట్

By:  Tupaki Desk   |   14 Dec 2015 7:30 PM GMT
ఖల్ నాయక్ కూతురి సూపర్ రిటార్ట్
X
సెలబ్రిటీలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో యాక్టివ్ గా ఉండడం కామన్ అయిపోయింది కానీ.. వారికి వేధింపులు మాత్రం ఎక్కువగానే ఉంటున్నాయి. అసభ్యమైన భాషలో ట్వీట్స్ చేస్తున్న ఆకతాయిలను చాలామంది పట్టించుకోవడం మానేస్తున్నారంతే. కానీ ఖల్ నాయక్ సంజయ్ దత్ కూతురు పేరు త్రిషాలా దత్ మాత్రం ఓ రేంజ్ లో రియాక్ట్ అయింది.

ఈ భామతో ఛాటింగ్ చేశాడు సల్మాన్ నసీర్ అనే కుర్రాడు. బాగానే స్పందించి కాసేపు ఆన్సర్స్ ఇవ్వడంతో.. తనతో డేట్ కి రావాల్సింది అడిగాడు. దీనికి నో చెప్పడంతో.. అతగాడికి కోపం వచ్చి.. ఏకంగా అగ్లీ బిచ్ అనేశాడు. సాధారణంగా అయితే రెచ్చిపోయేవాళ్లమే కానీ త్రిషాలా మాత్రం చాలా కూల్ గా రియాక్ట్ అయింది. ఈ ఛాట్ ని స్క్రీన్ షాట్ తీసి.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "అతను పిలిస్తే నేను డేట్ కి రానన్నాని సల్మాన్ నసీర్ బాగా ఫీల్ అయ్యాడు. అందుకే నన్ను అగ్లీ బిచ్ అన్నాడు. అదేంతో.. అంతకు కాసేపు ముందు కూడా నేను అందంగానే కనిపించాను. అంతలోనే వికారంగా మారిపోయాను. ప్రపోజ్ చేయడమే కాదు.. తిరస్కరిస్తే ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి పిల్లల్లారా.. ఎవరైనా తిరస్కరించడం బహుశా నీకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా.. కానీ బ్రదర్.. నీకు ఓ కుక్క బిస్కట్ కూడా ఎప్పుడూ వేయను" అంటూ కామెంట్ చేసింది త్రిషాలా.

ఈమె షార్ట్ అండ్ ఇంటెలిజెంట్ రియాక్షన్ కి సోషల్ మీడియా హ్యాట్సాఫ్ చెబుతోంది. చెప్పుతో కొట్టినట్లు ఆన్సర్ ఇచ్చి,. నలుగురికీ ఆదర్శంగా నిలిచింది.