Begin typing your search above and press return to search.

బుట్ట కింద దూరిన కోడిపిల్ల‌లా!

By:  Tupaki Desk   |   12 Aug 2018 6:31 AM GMT
బుట్ట కింద దూరిన కోడిపిల్ల‌లా!
X
బుట్ట కింద దూరిన కోడిపిల్ల‌లా .. నులివెచ్చ‌ని త‌ల్లి ఒడికి చేరిన బుజ్జి కుక్కపిల్ల‌లా ఎంత బావుందో ఈ బేబి కూచి. ఇంత‌కీ ఎవ‌ర‌మ్మా ఈ బార్బీ డాళ్‌? .. అని ప్ర‌శ్నిస్తే.. సంజు అలియాస్ సంజ‌య్‌ ద‌త్ గారాల ప‌ట్టీ త్రిషాలా దత్‌. అస‌లెందుకిలాంటి ఫోజిచ్చింది అంటే దానికో విశేషం ఉంది. త‌న పుట్టిన‌రోజు వేళ తాను పుట్టిన‌ప్పుడు ఉయ్యాల బేబీగా ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే అభిమానుల‌కు క‌నిపించాల‌న్న త‌ప‌న‌లో ఇలా బుట్ట కింద కోడిపిల్ల‌లా మారిపోయింది అంతే!

చేతిలో బార్బీ కుక్క‌పిల్లతో ఆరేళ్ల ప‌సిపాప‌లా ఎంత గోముగా సుతారంగా క‌నిపిస్తోందో క‌దూ? ఆ క్యూట్ అప్పియ‌రెన్స్‌ కి ఫ్యాన్స్ స్పెల్ బౌండ్ అయిపోయారు. త్రిషాలాలోని ఈ కొత్త యాంగిల్ ఊహించ‌లేనిది. ఇదివ‌ర‌కూ బికినీ లుక్‌ లో - బిగ్ బాబుల్ లుక్‌ లో చూసిన‌వాళ్లంతా అరెరే.. ఈ బూటీ ఇంతందంగా.. ఇంత ఫ్రెష్‌ గా ఉంటుందా? అంటూ ఒక‌టే చెవులు కొరికేసుకుంటున్నారు.

సోగ్గ‌త్తెరో.. ఒక్క పిట్ట‌నైన కొట్ట‌లేదు! అన్న చందంగా త్రిషాలా ఇంకా ఒక్క సినిమాలో అయినా న‌టించిందేం లేదు కానీ, అప్పుడే వీర‌లెవ‌ల్లో మేల్ ప్యాన్స్‌ని సంపాదించుకుంది. నిత్యం ఇన్‌ స్టా - ట్విట్ట‌ర్‌ లో అంద‌రికీ ట‌చ్‌ లో ఉంటూ వేడెక్కించే ఫోటోల‌తో ఊరిస్తూ ఉంటుంది. సెన్సేష‌న్ వ‌ర‌ల్డ్‌ లో ఏదో ఒక సెన్సేష‌న్‌ కి పాల్ప‌డి ఉనికిని చాటాల్సి ఉంటుంది. అలా త్రిషాలా ఇదివ‌ర‌కూ ఓ బోయ్‌ ఫ్రెండ్‌ తో కెమెరా క‌ళ్ల‌కు చిక్క‌డం మీడియాలో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింది. ఎనీవే.. కాబోయే అందాల క‌థానాయిక‌కు హ్యాపీ బ‌ర్త్ డే. ఇంత‌కీ ఈ సో క్యూట్ ప‌ప్పీ వ‌య‌సెంతో తెలుసా? జ‌స్ట్ 30!!