Begin typing your search above and press return to search.
ఒవైపు సంజయ్, మరోవైపు సైఫ్.. దున్నేస్తున్నారు!
By: Tupaki Desk | 23 April 2023 10:30 AM ISTసౌత్ నుంచి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా ఉంది. అలాగే హిందీ స్టార్స్ కూడా సౌత్ మార్కెట్ పై దృష్టి పెడుతున్నారు. షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ అయ్యి సౌత్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా సినిమాలు అనేసరికి హ్యూజ్ మార్కెట్ ఉంటుంది. అలాగే అన్ని భాషలకి ఒకే సారి రీచ్ కావొచ్చు.
దీనిని దృష్టిలో ఉంచుకొని బాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోలు ఇప్పుడు విలన్స్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలలో విలన్, హీరో అనే తేడా ఉండటం లేదు. ఈ రెండు పాత్రలకి సమాన ప్రాధాన్యత కథలలో ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని స్టార్స్ అందరూ విలన్స్ గా నటించడానికి రెడీ అయిపోతున్నారు.
బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబరాయ్ తెలుగులో వినయ విదేయ రామ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. అలాగే అజిత్ తమిళ్ మూవీలో కూడా నటించాడు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2లో సంజయ్ దత్ పోషించిన అధీరా పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ అధీరా క్యారెక్టర్ సౌత్ లో సంజయ్ దత్ డిమాండ్ అమాంతం పెంచేసింది.
ఈ నేపధ్యంలో ఇప్పుడు సంజయ్ దత్ లోకేష్, విజయ్ కాంబోలో వస్తున్న లియో మూవీలో పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే ప్రభాస్, మారుతి కాంబోలో వస్తోన్న రాజా డీలాక్స్ లో విలన్ గా నటిస్తున్నాడు. దీంతో పాటు రెండు కన్నడ పాన్ ఇండియా సినిమాలలో విలన్ గా కనిపించబోతున్నాడు. సంజయ్ దత్ ఒక్కో సినిమాకి 5 నుంచి 10 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
ఇప్పుడు సైఫ్ ఆలీఖాన్ ఆదిపురుష్ లో రావణుడి పాత్రలో కనిపిస్తున్నారు. దీంతో అతను విలన్ గా టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ కోసం సైఫ్ ఆలీఖాన్ 5 కోట్లకి పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ఇలా ఈ ఇద్దరు స్టార్స్ సౌత్ లో ఇప్పుడు స్టార్ విలన్స్ గా సెటిల్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారని చెప్పొచ్చు.