Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్‌ 2' నుంచి 'అధీరా' లుక్ లీక్...?

By:  Tupaki Desk   |   20 May 2020 10:10 AM GMT
కేజీఎఫ్‌ 2 నుంచి అధీరా లుక్ లీక్...?
X
ప్రస్తుతం సినీ అభిమానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'కేజీఎఫ్‌ 2' ఒకటి. ఇది 'కేజీఎఫ్‌' సినిమాకి సీక్వెల్ గా రానున్నది. దేశ వ్యాప్తంగా కన్నడ సినిమా స్థాయిని పెంచిన సినిమా 'కేజీఎఫ్‌'. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్‌' పాన్‌ ఇండియన్‌ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్‌’ నిలిచింది. సౌత్ ఇండియాలో 'బాహుబలి' తర్వాత హిందీలో సత్తా చాటిన సినిమా 'కేజీఎఫ్' అని చెప్పవచ్చు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం స్వీకెల్‌ ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌2’ రానున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్‌ 2’ చిత్రాన్ని హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ గా ఆవిష్కరిస్తున్నారని సమాచారం. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీలో కూడా 'కేజీఎఫ్ 2' పై క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ పార్ట్ లో విలన్స్ ని మించిన విలన్స్ ని చూపించి హీరో స్థాయిని తెలియకుండానే పెంచేశారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఈ సీక్వెల్ లో సంజయ్ దత్ ని 'అధీరా' పాత్ర కోసం ఎంచుకున్నాడు. ఇక ఎవరినైనా ఎదుర్కొనే రాకీ భాయ్ వారితో ఎలా తలపడతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో సంజయ్ దత్ 'అధీరా' లీక్ అయిన లుక్ అంటూ ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పవర్‌ ఫుల్ లుక్‌ లో అదరగొట్టేస్తున్నారు సంజయ్ దత్. దీంతో సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ఆ ఫొటోను విరివిగా షేర్ చేస్తూ వైర‌ల్ చేసేశారు. గతేడాది ఈ సీక్వెల్ నుంచి సంజయ్‌ 'అధీరా' లుక్‌ ను మూవీ యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్టుగా బయటకి వచ్చిన సంజయ్ దత్ లుక్ ‘కేజీఎఫ్‌ 2’లోనిదా..? కాదా..? అన్నది మాత్రం మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించాల్సిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. తెలుగు యాక్టర్ రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను అన్నీ కుదిరితే దసరా కానుకగా అక్టోబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రభుత్వం అనుమతులిస్తే మిగతా షూటింగ్ కంప్లీట్ చేసి చెప్పిన విధంగా దసరాకి వస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.