Begin typing your search above and press return to search.

సర్దార్‌ తో ఛాన్సు కొట్టేసిన సంజన

By:  Tupaki Desk   |   23 Nov 2015 10:22 AM IST
సర్దార్‌ తో ఛాన్సు కొట్టేసిన సంజన
X
అప్పుడెప్పుడో బుజ్జిగాడు సినిమాతో పరిచయం అయ్యింది సంజన. పూరి జగన్‌ అమ్మడిని ఓ రేంజులో పరిచయం చేశాడు కాని.. అక్కడి నుండి అమ్మడు నిలదొక్కుకోలేక పోయింది. ఆ తరువాత బికినీలు వేసినా.. పెదాల ముద్దులతో కవ్వించినా కూడా ఎందుకో క్లిక్‌ అవ్వలేదు. అసలు ఇప్పుడు చేతిలో రిబ్బన్‌ కటింగ్‌ ఆఫర్లు తప్పిస్తే.. తెలుగు సినిమా ఒక్కటీ లేదు.

ఈ రేంజులో ఖాళీగా ఉన్న టైములో.. ఆషామాషీ సినిమా కాదు ఏకంగా పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ సినిమా అమ్మడి ఖాతాలో వచ్చి పడింది. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ''సర్దార్ గబ్బర్‌ సింగ్‌'' సినిమాలో ఇప్పుడు సంజనకు పిలిచి మరీ ఒక రోల్‌ ఇచ్చాడట పవన్‌ కళ్యాణ్‌. కాకపోతే బీభత్సమైన బికినీలు - హాట్‌ అండ్‌ సెక్సీ లుక్స్‌ తో చంపేయడానికి ఇక్కడేం లేదట. తొమ్మది అడుగుల పట్టుచీర కట్టుకొని.. ఒంటినిండా నగలు ధరించి.. ఓ మహారాణి టైపు రోల్‌ లో అమ్మడు మెరవనుందట. మరి పవన్‌ కళ్యాన్‌ ను రొమాన్సు చేసే అవకాశం ఉందో లేదో తెలియదు కాని.. అసలు పవన్‌ సినిమాలో రోల్ అంటే మాత్రం ఇది కెరియర్‌ డసైడింగ్‌ ఆఫర్‌ అయ్యే ఛాన్సుందని అందరూ అంటున్నారు మరి.

ఇప్పటికే షూటింగ్‌ మొదలెట్టుకున్న సర్దార్‌ లో హీరోయిన్‌ గా కాజల్‌ నటిస్తుంటే.. మరో కీలకపాత్రలో మరో భామ లక్ష్మీ రాయ్‌ నటిస్తోంది.