Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 2: సంజన రీ-ఎంట్రీ ?

By:  Tupaki Desk   |   26 Jun 2018 6:00 AM GMT
బిగ్ బాస్ 2: సంజన రీ-ఎంట్రీ ?
X
నాని హోస్టింగ్ లో బిగ్ బాస్ సెకండ్ సీజన్ మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. మొదట్లో భిన్న అభిప్రాయాలూ వచ్చినప్పటికీ ఇటీవల ఎపిసోడ్స్ లో నాని తన టాలెంట్ తో అందరిని ఆకర్షించాడనే చెప్పాలి. అందరికి క్లాసులు పీకడం. ఎంకరేజ్ చేసి నవ్వించడం ఈ విధంగా బిగ్ బాస్ షోకి కొత్త తరహా క్రేజ్ తెప్పిస్తున్నాడు. ఇకపోతే మొదటి వీక్ లో సంజన అన్నే ఉహించనట్టుగానే ఎలిమినేట్ అయ్యింది.

బిగ్ బాస్ వల్ల పబ్లిసిటి తక్కువగా వచ్చింది అనుకుందో ఏమో మరి బయటకు రాగానే అమ్మడు తన స్టైల్ లో రచ్చ చేయడం స్టార్ట్ చేసింది. ఎక్కువగా నానిపై ఫోకస్ చేసి బిగ్ బాస్ పై విమర్శలు కూడా చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే బయటకు వచ్చిన తరువాత కూడా సంజనపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఆమె బ్యాక్ గ్రౌండ్ తో షోలో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట. బిగ్ బాస్ నిర్వాహకులపై ఒత్తిడి కూడా పెరుగుతోందని ఒక టాక్ అయితే వస్తోంది.

మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం సంజన చేసిన కామెంట్స్ కు చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఎంతో మందిని కాదని ఆమెకు అవకాశం ఇస్తే షోలో ఓవరాక్షన్ చేసింది కాకుండా ఇంకా బయట విమర్శలు చేస్తుందా? అని అనుకున్నారట. అయినా బిగ్ బాస్ రూల్స్ ని బ్రేక్ చేయడం అంటే షోకి వాల్యుని పోగొట్టినట్లే. మరి నిర్వాహకుల మీద ఒత్తిడి వస్తున్నది నిజమే అయితే వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!