Begin typing your search above and press return to search.

సర్దార్ భామల బాధలు అన్నీ ఇన్నీ కావయా

By:  Tupaki Desk   |   9 April 2016 11:30 AM GMT
సర్దార్ భామల బాధలు అన్నీ ఇన్నీ కావయా
X
పవర్ పవన్ కళ్యాణ్ మూవీలో నటించే ఛాన్స్ రావడం అంటే.. హీరోయిన్స్ కి బంపర్ ఆఫర్ వచ్చినట్లే. టాలీవుడ్ చందమామ కాజల్ టాప్ రేంజ్ కి ఎదిగినా, పవన్ తో ఛాన్స్ అందుకోవడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. అలాగే ఈ సినిమాతో పవన్ సినిమాలో మరో ఇద్దరు భామలు కనిపించారు. లక్ష్మీరాయ్ - సంజనలు.. సర్దార్ లో నటించారు. ఈ మూవీతో తమ కెరీర్ కి బూస్టప్ వస్తుందని చాలానే ఆశలు పెట్టుకున్నారు.

మొదటగా ఐటెం గాళ్ గా నటించిన లక్ష్మీ రాయ్ కి అయితే.. సినిమాలో ఓ కీలక రోల్ కూడా ఉంటుందన్నారు. కానీ సర్దార్ లో ఐటెం సాంగ్ తప్ప మరేం లేదు. అది కూడా పవన్ గత చిత్రాల ఐటెం సాంగ్స్ తో పోలిస్తే దిగదుడుపే. ఈ పాత్రతో లక్ష్మీరాయ్ కు దక్కినదేమీ లేదు. ఇక బుజ్జిగాడు సంజన బాధ అయితే మరీ దారుణం. మూవీలో విలన్ కి భార్యగా కీలక రోల్ చేసినా.. సర్దార్ మొత్తంలో సంజనకు ఉండేది ఒకే ఒక్క డైలాగ్. ఈ పాత్రతో సంజనకు కలిసొచ్చేది కానీ, ఆఫర్లు తెచ్చిపెట్టేసేంతటి పెర్ఫామెన్స్ కు అవకాశం ఉన్న రోల్ కానీ కాదు.

సర్దార్ గబ్బర్ సింగ్ లో ఆఫర్ రాగానే కెవ్వు కేక అనుంకుంటూ ఫ్యూచర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ఇద్దరు భామలూ ఇప్పుడు లబోదిబోమనాల్సిన పరిస్థితి తలెత్తింది. సినిమాకే టాక్ అన్ని రకాలుగా ఉంటే.. వీళ్ల కేరక్టర్లని పట్టించుకునే పరిస్థితి ఎవరికీ లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ చేయడం కారణం వీళ్లకు దక్కిన ప్రయోజనం ఏం లేదని చెప్పాల్సిందే.