Begin typing your search above and press return to search.

ఝాన్సీ రాణిలా క‌దం తొక్కుతున్న సానియా

By:  Tupaki Desk   |   13 March 2020 2:45 PM GMT
ఝాన్సీ రాణిలా క‌దం తొక్కుతున్న సానియా
X
క‌థ‌నరంగం లో క‌ర‌వాలం చేత‌ప‌ట్టి శ‌త్రు శిర‌చ్ఛేద‌నం చేసిన ఝాన్సీ ల‌క్ష్మీ భాయ్ గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకున్నాం. ఇక చంటి బిడ్డ‌ను వీపున‌కు క‌ట్టుకుని యుద్ధ రంగంలో చెల‌రేగిన చిరుత‌పులి అంటూ హిస్ట‌రీ పాఠం సోష‌ల్ మాస్టార్ చెబుతుంటే ఆస‌క్తిగా విన్నాం. ఇక ఝాన్సీరాణిపై ప‌లు భాష‌ల్లో సినిమాలు తెర‌కెక్క‌డం తో విజువ‌ల్ గా ఆ అద్భుతాన్ని వీక్షించే అవ‌కాశం దక్కింది.

ఇదిగో ఇక్క‌డ స‌న్నివేశం చూస్తుంటే అలాంటి సంఘ‌ట‌న‌నే గుర్తు చేస్తోంది. ఓ చేత్తో రాకెట్ చేత‌ప‌ట్టి .. మ‌రో చేత్తో బిడ్డ‌ను చంక‌నెత్తుకుని సానియా ఆట‌ను చూస్తుంటే మ‌రో ఝాన్సీ పుట్టుకొచ్చింద‌న్న భావ‌న ప్ర‌తి భార‌తీయుడికి క‌ల‌గాల్సిందే. త‌న‌దైన ప్ర‌తిభ తెగువ‌ తో క‌ఠోర సాధ‌న‌తో దేశం గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప క్రీడాకారిణికి పేరు తెచ్చుకున్న సానియా మిర్జా పెళ్లి త‌ర్వాతా అంతే క‌ఠోరంగా శ్ర‌మిస్తోంది. ఇక ఒక బిడ్డ త‌ల్లిగా చిన్నారి ఆల‌నాపాల‌నా చూస్తూనే ఇలా టెన్నిస్ క్రీడాకారిణిగా స‌త్తా చాటేందుకు ఎలాంటి సాహ‌సాల‌కు దిగుతోందో అర్థం చేసుకోవాల్సిందే.

తాజాగా సానియా త‌న అభిమానుల‌కు ఈ ఆస‌క్తిక‌ర‌ ఫోటో ని షేర్ చేశారు. త‌న జీవితాన్ని ఆ ఒక్క ఫోటో అద్భుతంగా ఆవిష్క‌రించింది. ఇక సానియా వార‌సుడు అప్పుడే ఇంతింతై ఎదిగేస్తున్నాడ‌ని ఈ ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌లే సానియా ఇండోనేషియాపై ఆడిన తీరు అభిమానుల్ని మెస్మ‌రైజ్ చేసింది. మమ్మీ అయినా ఓవైపు బిడ్డ అల‌నా పాల‌నా చూసుకుంటూనే ఆట‌లో గెల‌వాల్సి ఉంటుంది. అది ఎంత క‌ష్ట‌మో ఊహించ‌గ‌లిగేదే. ఇక ఇటీవ‌లే విజ‌య్ న‌టించిన `బిగిల్`లో ఒక పెళ్ల‌యిన యువ‌తి త‌న డ్రీమ్ అయిన‌ ఆట‌కోసం ఎలాంటి సాహ‌సం చేసింది? అన్న‌దానిని హైలైట్ గా చూపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే స్ఫూర్తి తో సానియా ఆట‌లో స‌త్తా చాటేందుకు బ‌రిలో దిగుతోంద‌న్న‌మాట‌.