Begin typing your search above and press return to search.

సానియా సోద‌రితో అజార్ కొడుకు పెళ్లి..?

By:  Tupaki Desk   |   7 March 2019 7:16 AM GMT
సానియా సోద‌రితో అజార్ కొడుకు పెళ్లి..?
X
త‌రం మారింది. కొత్త త‌రం వ‌చ్చేసింది. కొత్త ప్రేమ‌లు.. వారి పెళ్లి క‌బుర్లు ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి కోవ‌కే చెందిన ఉదంతం ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌ముఖుల కుటుంబ స‌భ్యులు.. వారి వార‌సుల ప్రేమ‌ల మీదా జ‌నాల అటెన్ష‌న్ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజా ఉదంతం వెలుగు చూసింది.

ఒక‌ప్పుడు టీమిండియా కెప్టెన్ గా మ‌హ్మ‌ద్ అజ‌రుద్దీన్ ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. క్రీడాకారుడిగానూ.. వ్య‌క్తిగ‌త అంశాల విష‌యంలో ఆయ‌న త‌ర‌చూ వార్త‌ల్లో క‌నిపిస్తూనే ఉంటారు. అజ‌రుద్దీన్ ప్రేమ‌లు.. పెళ్లిళ్ల వ్య‌వ‌హారం అప్ప‌ట్లోనే హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా ఆయ‌న కుమారుడు పాతికేళ్ల అస‌ద్‌.. ప్ర‌ముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోద‌రి అన‌మ్ ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం గాఢ‌మైన అనుబంధం దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. త‌న కంటే మూడేళ్లు పెద్ద‌దైన సానియా సోద‌రితో అజ‌రుద్దీన్ కుమారుడి బంధం అంత‌కంత‌కూ పెరుగుతూ.. ఇప్పుడు పెళ్లి పీట‌ల వ‌ర‌కూ వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఒక మీడియా క‌థ‌నం ప్ర‌కారం ఇరువురి మ‌ధ్య అనుబంధం అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతోంద‌ని.. తాజాగా వారిద్ద‌రూ త‌మ రిలేష‌న్ ను త‌ర్వాతి ద‌శ‌కు తీసుకెళ్లాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ ఏడాది చివ‌ర్లో వీరి పెళ్లి ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రెండు కుటుంబాల నుంచి రాలేదు. మొత్తానికి రెండు ప్ర‌ముఖ క్రీడా కుటుంబాల మ‌ధ్య వియ్యం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.