Begin typing your search above and press return to search.
సంగీత్ లో భీష్మ ఇస్మార్ట్ సందడి
By: Tupaki Desk | 27 July 2020 9:00 AM ISTపెళ్లి సందడి అంటే ఊరంత పందిరి.. పచ్చని మామిడాకుల తోరణాలు .. ఇళ్లంతా జిగేల్మనే యాంబియెన్స్ .. సీరియల్ దండల లైటింగులు ఇవన్నీ కామనే. ఇక ఇటీవలి కాలంలో మూడు రోజుల పెళ్లిళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్ .. బీచ్ వెడ్డింగ్ అంటూ రకరకాల వెరైటీల్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీ వింగ్ లో అయితే ఈ సందడి ఒకరోజు రెండ్రోజులు కాదు.. ఏకంగా వారాల పాటు ఇళ్లంతా సందడితోనే నిండిపోతుంది. చుట్టాలు పక్కాలతో సందడి పీక్స్ కి చేరుతుంది. అయితే వీటన్నిటికీ కరోనా చెక్ పెట్టేసింది. మాయదారి మహమ్మారీ దెబ్బకు 2020 బ్యాడ్ ఇయర్ గా మారిపోయింది.
ఇలాంటి టైమ్ లో కూడా ఎంతో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి సెలబ్రిటీ వెడ్డింగ్స్ . ఇంతకుముందు నిఖిల్ పెళ్లి సంబరం వీడియోలు అభిమానులకు ఎంతో గొప్ప ఫీల్ ని తెచ్చాయి. భారీగా విందు వినోదాలు సెలబ్రిటీల నడుమ హంగామా కనిపించకపోయినా సంథింగ్ ఏదో ఉంది అనిపించాడు నిఖిల్.
ఇప్పుడు నితిన్ వంతు. వారం పది రోజులుగా నితిన్ - షాలిని జంట పెళ్లి సంబరాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఒకటే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం.. మెహందీ ఫంక్షన్.. సంగీత్ .. ఇలా ఏ వేడుకను వదిలి పెట్టలేదు. తాజాగా సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. ఇందులో నితిన్ - శాలిని కందుకూరి జంట సందడి ఆకట్టుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సాంగ్ కి నితిన్ స్టెప్పులేశాడు. ఇష్క్ .. భీష్మ.. పాటలకు స్టెప్పులేశారు. అలాగే పలు బాలీవుడ్ సాంగ్స్ కి డ్యాన్సులు చేసిన వైనం పై ముచ్చట సాగుతోంది. ఆదివారం నాడు హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్లో ఈ జంట వివాహం జరిగింది. వేడుకకు పలువురు ముఖ్య అతిథులు విచ్చేశారని సమాచారం. పెళ్లి వేడుక ఫోటోలు సహా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.