Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసు: న్యూస్ ఛానల్ పై రూ.200 కోట్ల పరువు నష్టం దావా...!

By:  Tupaki Desk   |   15 Oct 2020 12:30 PM GMT
సుశాంత్ కేసు: న్యూస్ ఛానల్ పై రూ.200 కోట్ల పరువు నష్టం దావా...!
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం అతని ఫ్రెండ్, ప్రొడ్యూసర్ సందీప్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. జూన్ 14న సుశాంత్ తన నివాసంలో విగతజీవిగా కనిపించిన తర్వాత.. అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్న వారిలో సందీప్ సింగ్ ఒకరు. సుశాంత్ బాడీకి పోస్ట్ మార్టం జరిపిన కూపర్ హాస్పిటల్ లో కూడా సుశాంత్ సోదరితో సందీప్ ఉన్నాడు. అయితే సుశాంత్ కు సందీప్ చాలా సన్నిహితుడని మొదట్లో అందరూ భావించినా.. వివిధ వార్తా ఛానెళ్లలో బహిర్గతం అయిన సుశాంత్ కాల్ రికార్డులను బట్టి అతను గత కొన్ని నెలలుగా అతనితో సన్నిహితంగా లేడని తేలింది. ఇదే సమయంలో కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ సుశాంత్ కేసుతో లింక్ పెడుతూ సందీప్ సింగ్ పై కథనాలు ప్రసారం చేసాయి. ఈ నేపథ్యంలో తనకు పరువు నష్టం కలిగించేలా వార్తా కథనాలు ప్రసారం చేసిందనుకు ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ మరియు దాని చీఫ్‌ ఎడిటర్ కు సందీప్ సింగ్ లీగల్ నోటీసులు పంపించారు.

సందీప్ సింగ్ ఈ లీగల్ నోటీసులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ''ఇది తిరిగి చెల్లించాల్సిన సమయం'' అని పేర్కొన్నాడు. రిపబ్లిక్ టీవీ మరియు అర్నాబ్ గోస్వామిలు తన పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిందనుకు నా క్లయింటుకు వ్రాతపూర్వకం గాలేదా వీడియో ద్వారా బేషరతుగా క్షమాపణ చెప్పి రూ .200 కోట్ల భారీ నష్ట పరిహారం చెల్లించాలని సందీప్ తరపు న్యాయవాది నోటీసులో తెలిపాడు. నా క్లయింట్ పరువు నష్టం కలిగించే ప్రసారం చేసిన అన్ని వీడియో ఫుటేజులు మరియు లిఖిత కథనాలను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నోటీసు అందుకున్న 15 రోజులులోగా నష్ట పరిహారం చెల్లించకపోతే.. వారిపై చట్టపరంగా సివిల్ మరియు క్రిమినల్ లా కింద చర్యలకు ఉపక్రమిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ సందీప్ సింగ్ 'మేరీ కోమ్' 'అలీఘర్' 'సరబ్‌ జిత్' 'భూమి' 'పీఎం నరేంద్ర మోడీ బయోపిక్' వంటి చిత్రాలను నిర్మించాడు. ఇదిలా ఉండగా రిపబ్లిక్ టీవీ మరియు అర్నాబ్ గోస్వామి లపై బాలీవుడ్ కు చెందిన 4 అసోసియేషన్స్ మరియు 34 ప్రముఖ నిర్మాణ సంస్థలు ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే.