Begin typing your search above and press return to search.

చరణ్ తో అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఏంటబ్బా?

By:  Tupaki Desk   |   14 Dec 2017 5:06 AM GMT
చరణ్ తో అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఏంటబ్బా?
X
రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం మూవీని పూర్తి చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే బోయపాటి శ్రీనుతో సినిమాను అధికారికంగా ప్రారంభించాడు మెగా పవర్ స్టార్. అలాగని చెర్రీ కొత్త ప్రాజెక్టుల సంగతులు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. రాజమౌళితో సినిమా వీటిలో ప్రముఖమైనది అయితే.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అంటున్నారు.

అర్జున్ రెడ్డి లాంటి న్యూ ఏజ్ బ్లాక్ బస్టర్ రూపొందించిన దర్శకుడు సందీప్ వంగా.. తరచుగా రామ్ చరణ్ తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి మూవీని బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడనే టాక్ ఉన్నా.. మెగా హీరోతో మూవీ ప్లానింగ్ కూడా ఉందని అంటున్నారు. ఈ దర్శకుడికి హీరో శర్వానంద్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. శర్వానంద్.. సందీప్ వంగా.. యూవీ క్రియేషన్స్ పార్ట్నర్ విక్కీలు రీసెంట్ గా రామ్ చరణ్ ను కలిశారు. అందరూ కలిసి చెర్రీ వైఫ్ ఉపాసన రూపొందించిన క్రిస్మస్ ట్రీ దగ్గర పోజ్ ఇచ్చారు.

అయితే.. రామ్ చరణ్- శర్వాలతో ఓ మల్టీ స్టారర్ ను సందీప్ వంగా ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇందుకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నాడట. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. రంగస్థలం నైజాం రైట్స్ ను విక్కీ దక్కించుకున్నాడనే టాక్ ఉంది. వీరిద్దరూ కలిసి మల్టీప్లెక్స్ లు- మినీ థియేటర్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.