Begin typing your search above and press return to search.

షాకిస్తున్న ప‌్ర‌భాస్ డేర్ 'డెవిల్' డెసిష‌న్‌!

By:  Tupaki Desk   |   25 Dec 2019 7:23 AM GMT
షాకిస్తున్న ప‌్ర‌భాస్ డేర్ డెవిల్ డెసిష‌న్‌!
X
అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్ లో .. క‌బీర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్ లో ట్రెండ్ సెట్టింగ్ డైరెక్ట‌ర్ గా సంచ‌ల‌నాలు సృష్టించారు సందీప్ రెడ్డి వంగా. ప్ర‌స్తుతం అత‌డి పేరు ఇంటా బ‌య‌టా మార్మోగిపోతోంది. ఆ క్ర‌మంలోనే అత‌డు తెర‌కెక్కించ‌బోయే రెండో సినిమా ఏది? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. క‌బీర్ సింగ్ అత‌డికి రెండో సినిమానే అయినా తెలుగు సినిమా కాదు కాబ‌ట్టి మ‌న ఆడియెన్ కి సందీప్ ఇచ్చే ట్రీట్ ఎలా ఉండ‌నుంది? అన్న ఆస‌క్తి నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే సందీప్ వంగాని క‌బీర్ సింగ్ నిర్మాత‌లు అస్స‌లు విడ‌వ‌కుండా త‌ర్వాతి సినిమాని ప్ర‌క‌టించేశారు. డెవిల్ అనే టైటిల్ ని ప్ర‌క‌టించి సందీప్ వంగాని లాక్ చేశారు. అటుపై బాలీవుడ్ క్రేజీ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ ని సంప్ర‌దించారు. ఆరంభం ర‌ణ‌బీర్ ఓకే చెప్పినా ఎందుక‌నో ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అత‌డు ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడు. అటుపైనే అస‌లు క‌థ మొద‌లైంది.

ర‌క‌ర‌కాల డైల‌మాల న‌డుమ సందీప్ నేరుగా వ‌చ్చి డార్లింగ్ ప్రభాస్ కి క‌థ చెప్పాడు. అత‌డు వినిపించిన క‌థ డార్లింగ్ కి న‌చ్చింది. వెంట‌నే న‌టించేందుకు అంగీక‌రించాడు. అలాగే డేట్స్ ని కేటాయించాడ‌ట‌. మైత్రి మూవీ మేక‌ర్స్ చేతిలో ప్ర‌భాస్ కాల్షీట్లు ఉన్నాయి. దీంతో మైత్రితో క‌లిసి టీసిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని ప్ర‌చార‌మైంది. అంతా కుదిరితే.. మైత్రి సంస్థ ఈ సినిమాతోనే బాలీవుడ్ లో అడుగు పెడుతోంద‌న్న క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే.

అయితే ప్ర‌భాస్ అభిమానులు మాత్రం మ‌రో సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు సందీప్ వంగా వినిపించింది ఒక ఫ్రెష్ స్టోరీనా? లేక ర‌ణ‌బీర్ కాద‌నుకున్న డెవిల్ క‌థ‌నే అత‌డు అంగీక‌రించారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ర‌ణ‌బీర్ బాడీ లాంగ్వేజ్ కి ప్ర‌భాస్ శ‌రీర భాష‌కు అస్స‌లు పోలికే ఉండ‌దు. అలాంట‌ప్పుడు త‌న‌కోసం రాసిన క‌థ‌ను ప్ర‌భాస్ కి ఎలా చెబుతాడు? ఇప్పుడు అదే క‌థ‌ని ప్ర‌భాస్ కి త‌గ్గ‌ట్టుగా మారుస్తాడా? ఇలా ర‌క‌ర‌కాల సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ప్ర‌భాస్ సైతం స్క్రిప్టు మొత్తం త‌న‌కు అనుకూలంగా ఉంటేనే ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఆ మేర‌కు సందీప్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుందేమో! అంటూ భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి దీనిపై ప్ర‌భాస్ కానీ.. సందీప్ కానీ క్లారిటీ ఇస్తే బావుంటుందేమో!!