Begin typing your search above and press return to search.

సందీప్ ప్రాజెక్ట్ లేదా?

By:  Tupaki Desk   |   23 April 2018 7:33 AM GMT
సందీప్ ప్రాజెక్ట్ లేదా?
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ దర్శకులతో వర్క్ చేయడానికి ముందుంటారని అందరికి తెలిసిందే. కొత్త దర్శకులతో అలాగే చిన్న దర్శకులతో సినిమా చేయడానికి ఆయన చాలా ఆలోచిస్తారు. ఈ విషయంలో కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ మహేష్ మాత్రం రిస్క్ తీసుకోడు. నిర్మాతలు నష్టపోకూడదు ఆడియెన్స్ నిరాశ చెందకుడదు అనే తరహాలో మహేష్ ఎక్కువగా ఆలోచిస్తాడు. దాదాపు ఇప్పటి నుంచి సూపర్ స్టార్ ప్రయోగాలకు దూరంగా ఉండాలనే అనుకుంటున్నాడు.

ఇకపోతే గతంలో మహేష్ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తప్పకుండా వారి కలయికలో ఒక సినిమా రాబోతుందని అంతా అనుకున్నారు. మహేష్ 25వ సినిమా తరువాత ఆ ప్రాజెక్ట్ ఉంటుందని కూడా టాక్ వచ్చింది. కానీ మహేష్ తన 26వ సినిమాను సుకుమార్ తో ఫిక్స్ అయ్యాడు. రంగస్థలం హిట్ అవ్వడంతో మహేష్ మైత్రీ వాళ్లతో అధికారికంగా ప్రాజెక్ట్ గురించి చెప్పించేశాడు. దీంతో అర్జున్ రెడ్డి ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది. మహేష్ కోసం కథను ప్రిపేర్ చేస్తున్న సందీప్ ఇప్పుడు మహేష్ కోసం 2020 వరకు వేయిట్ చేయక తప్పదు.

ఆ లోపు మరో స్టార్ హీరోతో చేయడానికి కొత్త కథను సెట్ చేసుకోవాలి. అర్జున్ రెడ్డి చూసిన తరువాత చాలా మంది స్టార్ హీరోలు ఆ దర్శకుడితో వర్క్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం స్టార్ హీరోలు బిజీగా ఉన్నారు. ఇక కుర్ర హీరోలు కూడా దాదాపు బిజిగానే ఉన్నారు. ఇప్పుడు సందీప్ వెయిట్ చేయక తప్పదు. మరి మహేష్ కోసం ఎదురుచూస్తాడా లేక మరో కుర్ర హీరోతో వర్క్ చేస్తాడా అనేది త్వరలోనే తెలుస్తుంది. మరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.