Begin typing your search above and press return to search.

కబీర్ సింగ్ లో డోస్ ఎక్కువ అంటున్న వంగా

By:  Tupaki Desk   |   23 Nov 2018 7:12 AM GMT
కబీర్ సింగ్ లో డోస్ ఎక్కువ అంటున్న వంగా
X
హిట్లు.. సూపర్ హిట్లు.. బ్లాక్ బస్టర్లు వస్తుంటాయి పోతుంటాయి గానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గతిని మార్చే సినిమాలు మాత్రం చాలా అరుదుగా వస్తాయి. అలా టాలీవుడ్ దశదిశను మార్చిన సినిమాల లిస్టులో సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా బోల్డ్ నెస్ చూసి సాంప్రదాయవాదులు షాక్ కు గురయిన మాట వాస్తవమే గానీ ఇప్పడి జనరేషన్ మాత్రం ఇన్స్టెంట్ గా సినిమాకు కనెక్ట్ అయింది.

ఇప్పుడు ఇదే సినిమాను సందీప్ వంగా హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ పాత్రలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. 'అర్జున్ రెడ్డి'.. 'కబీర్ సింగ్' కు ఏ విషయంలో మార్పు ఉండొచ్చు అనే విషయంపై సందీప్ మాట్లాడుతూ తెలుగులో సినిమా బోల్డ్ గానే ఉంటుందిగానీ తనకంటూ కొన్ని పరిమితులు పెట్టుకుని సినిమాను తెరకెక్కించాల్సి వచ్చిందట. ఆ సీన్లను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కాబట్టి డీటెయిల్స్ లో కి వెళ్ళకుండా 'అర్జున్ రెడ్డి' ని తెరకెక్కించాడట. ఇప్పుడు 'కబీర్ సింగ్' విషయంలో సందీప్ స్వీయపరిమితులేవీ పెట్టుకోవడం లేదట.

ముఖ్యంగా రొమాన్స్.. ఇంటిమేట్ సీన్స్ విషయంలో 'అర్జున్ రెడ్డి' కి మించిన డోస్ ఉంటుందని సందీప్ వంగా అంటున్నాడు. సాధారణంగా బాలీవుడ్ లో రొమాన్స్ డోస్ ఎక్కువగానే ఉంటుంది. లిప్పు లాకులు ఎప్పుడో దశాబ్దం క్రితమే మొదలయ్యాయి. కాబట్టి డోస్ పెంచినా బాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇదిలా ఉంటే ఈ సినిమా విజయంపై షాహిద్ కపూర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.